
టోక్యో, డిసెంబర్ 8: జపాన్ తీరంలో తీవ్ర భూకపం తలెత్తింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్‌పై దాదాపు 7.2గా నమోదైంది. సముద్రం అలలు 10 అడుగుల మేర ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర జపాన్ అంతటా సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. జపాన్ తూర్పు తీరంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.13 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. ఇది 30 మైళ్ల కంటే ఎక్కువ లోతులో కేంద్రీకృతమై ఉంది. దీంతో అక్కడి అధికారులు హొక్కైడో, అమోరి, ఇవాటే ప్రిఫెక్చర్ల పసిఫిక్ దీవులకు ముందస్తు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
అయితే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే మాత్రం దీని తీవ్రత 7.6గా అంచనా వేస్తుంది. ఇది సాధారణంగా రాబోయే పెద్ద భూకంపాన్ని సూచించే సంకేతం. సాధారణంగా ఈ స్థాయి భూకంపాలు తలెత్తితే తీవ్రమైన నష్టాన్ని, గణనీయమైన విధ్వంసాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి. సునామీలు ఎంత వినాశకరమైనవో జపాన్‌కు బాగా తెలుసు. 2011 టోహోలో వచ్చిన భూకంపం, సునామీ విపత్తు చరిత్రలో అత్యంత దారుణమైన విపత్తులలో ఒకటి. దీని వలన 375 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. 20 వేల మంది మరణించినట్లు అంచనా. ఇది ఫుకుషిమా అణు ప్రమాదానికి సమానం. అంతర్జాతీయ అణు సంఘటన స్కేల్‌లో చెర్నోబిల్‌తో పాటు ఏడవ రేటింగ్ పొందిన ఏకైక సంఘటన ఇది. ఈ ప్రమాదం పరిణామాలు కనీసం 2051 వరకు కొనసాగుతాయని భావిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.