Earthquake: ఇండోనేషియాను కుదిపేస్తున్న వరుస భూకంపాలు.. 8 మంది మృతి.. భారీగా నష్టం

|

Apr 12, 2021 | 2:12 PM

Indonesia Earthquake: ఇండోనేషియాను వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. శనివారంతో పాటు ఆదివారం కూడా ఇండోనేషియాలో

Earthquake: ఇండోనేషియాను కుదిపేస్తున్న వరుస భూకంపాలు.. 8 మంది మృతి.. భారీగా నష్టం
Earthquake In Indonesia
Follow us on

Indonesia Earthquake: ఇండోనేషియాను వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. శనివారంతో పాటు ఆదివారం కూడా ఇండోనేషియాలో భూకంపం అలజడి సృష్టించింది. ఈ భారీ భూకంపం ధాటికి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 39 మంది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతోపాటు పలు ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లినట్లు జాతీయ విపత్తు ఏజెన్సీ ప్రతినిధి రాదిత్య జాతి వెల్లడించారు. ఇండోనేషియాలోని జావా ద్వీపం తీరంలో ఆదివారం రాత్రి సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా న‌మోదైంద‌ని జాతీయ విప‌త్తు సంస్థ పేర్కొంది. ఈ కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మ‌రో 39 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డట్లు ఏజెన్సీ పేర్కొంది.

తాజాగా సంభవించిన ఈ భూ ప్రకంపనలకు 1,189 ఇళ్లు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. ఇండోనేషియాలోని లుమాజాంగ్, మ‌లంగ్, బ్లిట‌ర్, జెంబ‌ర్, ట్రెంగ్లక్‌లో భారీగా న‌ష్టం జరిగింది. ఆరోగ్య కేంద్రాలు, విద్యాసంస్థలు, దేవాల‌యాలు, ప్రభుత్వాలు కార్యాల‌యాలు కూడా ధ్వంస‌మ‌య్యాయని జాతీయ విపత్తు సంస్త పేర్కొంది. నివాసాలు కోల్పోయిన వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇదిలాఉంటే.. శనివారం తూర్పు జావాలోని మలంగ్‌ నగరం సమీపంలో సంభవించిన భారీ భూకంపం ధాటికి ఆరుగురు మరణించారు. చాలామంది నిరాశ్రయులయ్యారు. వరుసగా భూకంపాలు సంభవిస్తుండటంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుశాఖ వెల్లడించింది.

ఇదిలాఉంటే.. వారం రోజుల క్రితం వరదల ధాటికి 170 మందికి పైగా మృతి చెందగా.. దాదాపు 50 మంది గల్లంతయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. అంతకుముందు సంభవించిన భూకంపాల్లో కూడా ప్రజలు భారీగా నష్టపోయారు. సుల‌వేసి ద్వీపంలోని ప‌లులో 2018లో సంభ‌వించిన భూకంపం.. ఆ త‌ర్వాత వ‌చ్చిన సునామీ కార‌ణంగా 4,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

COVID-19: బంగ్లాదేశ్‌లో కరోనా విజృంభణ.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..

Alibaba: ఆలీబాబాకు మరో షాక్‌… భారీ జరిమానా వేసిన చైనా ప్రభుత్వం… ( వీడియో )