Earthquake: ఆఫ్ఘాన్‌ – తజకిస్థాన్‌ సరిహద్దుల్లో భారీ భూకంపం.. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు..

|

Feb 05, 2022 | 11:57 AM

Earthquake Today: ఆఫ్ఘానిస్థాన్‌ - తజకిస్థాన్‌ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో ఆఫ్ఘనిస్థాన్, తజికిస్థాన్ సహా.. భారత్, పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో

Earthquake: ఆఫ్ఘాన్‌ - తజకిస్థాన్‌ సరిహద్దుల్లో భారీ భూకంపం.. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు..
Earthquake
Follow us on

Earthquake Today: ఆఫ్ఘానిస్థాన్‌ – తజకిస్థాన్‌ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో ఆఫ్ఘనిస్థాన్, తజికిస్థాన్ సహా.. భారత్, పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. జమ్మూకశ్మీర్‌తో పాటు నోయిడా, ఢిల్లీల్లో భూప్రకంనలు చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. శనివారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఆఫ్ఘానిస్థాన్‌ – తజకిస్థాన్‌ (Afghanistan-Tajikistan) సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం (Earthquake) తీవ్రత 5.7గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ వెల్లడించింది.

ఆఫ్ఘాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయ దిశలో 118 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్‌సీఎస్ అధికారులు తెలిపారు. అయితే భూకంపం కారణంగా ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం రాలేదు. భూకంప ప్రభావంతో దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించడంతో జమ్మూకశ్మీర్, ఢిల్లీ, నోయిడా తదితర ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Also Read:

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సీన్.. ప్రత్యక్షంగా కలుసుకోనున్న సీఎం కేసీఆర్, బండి సంజయ్..

Yogi Adityanath: అసదుద్దీన్ ఓవైసీపై దాడి ఘటన.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..