వారి తండ్రి ఎక్కడుంటాడో తెలియదు.. తల్లి ఒక్కరే ఆ పిల్లలను చూసుకుంటుంది. సడెన్‌గా ఏమైందో ఏమోగానీ తల్లి మరణించింది. దీంతో తల్లి మృతదేహంతో పిల్లలు ఇద్దరు చాలా రోజులు గడిపారు. పిల్లలు పాఠశాలకు రాకపోటంతో వాకాబు చేయగా ఈ విషయం బయటపడింది. ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది.
ఫ్రాన్స్.. లే మాన్స్ నగరంలోని అపార్టుమెట్లో ఓ వివాహిత ఇద్దరు ఆడ పిల్లలతో ఉంటుంది. అందులో ఒకరి ఐదేళ్లు కాగా మరొకరికి ఏడేళ్లు ఉంటాయి. అయితే ఓ రోజు పిల్లులు పాఠశాలకు వెళ్లి వచ్చేసరికి తల్లి పడిపోయి కనిపించింది. ఆ పిల్లలు అమ్మా.. అమ్మ అంటూ ఆమెను లేపడానికి ప్రయత్నించారు. కానీ ఆమె చనిపోయిందని వారికి తెలియదు. ఇలా తల్లి మృతదేహంతో వారు చాలా రోజులు గడిపారు. అయితే వారు స్కూల్‌కు రాకపోయేసరికి యాజమాన్యం వారిని సంప్రదించే ప్రయత్నం చేసింది. వారు మమ్మీ నిద్రపోతోందని సమాధానం ఇచ్చారు. ప్రతిరోజు ఇదే సమాధానం రావటంతో పోలీసులు ఆ అపార్టుమెట్కు వెళ్లారు. అక్కడ మృతదేహాంతో పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పిల్లలను ఆస్పత్రికి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. చనిపోయిన మహిళ 1990లో జన్మించిందని.. సహజ కారణాలతో ఆమె మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు బాగైన తర్వాత వారి నుంచి సమాచారం తెసులుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు.