Marburg Virus: ఈ మహమ్మారి సోకితే మృత్యువే.. ఆఫ్రికాలో మరో కొత్త వైరస్.. డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్

|

Aug 10, 2021 | 7:42 AM

Marburg disease: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి పీడ ఇప్పుడిప్పుడే తగ్గుతున్న తరుణంలో కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ప్రాణాంతకమైన

Marburg Virus: ఈ మహమ్మారి సోకితే మృత్యువే.. ఆఫ్రికాలో మరో కొత్త వైరస్.. డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్
Marburg Virus
Follow us on

Marburg disease: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. మహమ్మారి పీడ ఇప్పుడిప్పుడే తగ్గుతున్న తరుణంలో కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ కేసును మొదటిగా ఆఫ్రికాలో నిర్థారించారు. ఆఫ్రికాలోని పశ్చిమ ప్రాంతం గినియా దేశంలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ బారినపడి ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఆగస్టు 2న గినియా దేశంలోని గుక్కెడో ప్రిఫెక్చర్‌లో మరణించిన రోగి నుంచి సేకరించిన నమూనాలలో ఈ ప్రాణాంతక వైరస్ కనుగొన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

గబ్బిలాల ద్వారా సోకే ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. ఈ వ్యాధి సోకితే 88% వరకు మరణాల రేటు ఉంటుందని డబ్లూహెచ్ఓ తెలిపింది. రక్తస్రావ జ్వరానికి కారణమయ్యే అత్యంత తీవ్రమైన వ్యాధి మార్బర్గ్ వైరస్. ఎబోలా వైరస్ లక్షణాలు కలిగినటువంటి ఈ వైరస్.. కోవిడ్-19 మాదిరిగానే జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుందని ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే.. మార్బర్గ్ వైరస్ ప్రమాదకరమని.. ఇది చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున.. మొదట్లోనే నిలువరించాలని ఆఫ్రికా డబ్ల్యూహెచ్‌ఓ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మోయిటి పేర్కొన్నారు. గినియాలో గతేడాది ఎబోలా వైరస్ సోకి 12 మంది మరణించారు. ఆ వైరస్‌ను అరికట్టిన నెలల్లోనే మార్బర్గ్ కేసు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. కాగా.. గినియా ప్రభుత్వం కూడా మార్బర్గ్ కేసును ధృవీకరించింది.

మార్బర్గ్ వైరస్ సాధారణంగా గబ్బిలాల నుంచి వ్యాపిస్తుంది. ఆ తర్వాత కోవిడ్-19 మాదిరిగానే అత్యంత వేగంగా.. ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని.. వైరస్ ప్రభావం ఎక్కువ కనిపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది సోకితే 88శాతం వరకు మరణం సంభవించే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. కాగా.. పశ్చిమ ఆఫ్రికాలో వైరస్ కనుగొనడం ఇదే మొదటిసారని పేర్కొంది. ఈ వైరస్.. లక్షణాలు అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, అసౌకర్యంతో అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది.

Also Read:

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన ధరలు..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇంట్లో సీలింగ్‌పైన దూరిన భారీ కొండ చిలువ.. చివరకు ఏమైందంటే.. వీడియో వైరల్‌