Syringe Attacks: ఫ్రాన్స్‌ను పిచ్చెక్కిస్తున్న సిరంజి దాడులు.. అసలు అక్కడ ఏం జరుగుతుంది!

ఆదేశంలో సిరంజుల దాడులు కలకలం రేపుతున్నాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జనాలపై సిరంజులతో దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఆ దేశంలో జరిగిన ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్ సందర్భంగా సుమారు 145 మందిపై ఈ దాడులు జరిగాయి. అయితే ఈ దాడులు చేస్తున్నవారు ఎవరూ.. ఇంతకు ఎందుకు దాడి చేస్తున్నారు. వారు గుచ్చే సిరంజీలలో ఏముంది అనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.

Syringe Attacks: ఫ్రాన్స్‌ను పిచ్చెక్కిస్తున్న సిరంజి దాడులు.. అసలు అక్కడ ఏం జరుగుతుంది!
France

Updated on: Jun 24, 2025 | 6:15 PM

సాధారణ జనాలపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సిరంజీలతో దాడికి పాల్పడుతున్న ఘటనలు ఫ్రాన్స్‌ దేశంలో వెలుగుచూశాయి. ఆ దేశంలోని ప్రజలకు ఇన్నాళ్లు ఫేవరెట్‌గా ఉన్న ‘ఫెటెస్ డి లా మ్యూజిక్ ఫెస్టివల్’ ఇప్పుడు చేదు అనుభవంగా మారింది. ఈ మ్యూజిక్ వేడుకల్లో పాల్గొన్న ప్రేక్షకులపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ‘సిరంజులతో దాడులకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా సుమారు 145 మందిపై ఈ తరహా దాడులు జరిగాయి. అయితే ఈ దాడుతో సంబంధం ఉన్న 12 మందిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కస్టడీలోకి తీసుకొని దాడులకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు గుచ్చుతున్న సిరంజీలలో ఏముంది.. ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు అనే కోణంలో పోలీసలు వారిని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా నిందితుల చేతుల్లో సూది పోట్లకు గురైన కొంత మంది అనారోగ్యబారిన పడ్డారు. అయితే దాడులకు పాల్పడుతున్న వ్యక్తులు గుండెలు, చేతులు, కాళ్లు, పిరుదులపై సిరంజితో గుచ్చినట్లు బాధితులు తెలిపారు. వాటి కారణంగా తమలో తలతిరగడం, వాంతులు, అసౌకర్యం వంటి లక్షణాలను కనిపించాయని తెలిపారు. దీంతో తాము హాస్పిటల్‌లో చేశారమని చెప్పుకొచ్చారు. వైద్యులతో రక్త పరీక్షలు చేయించుకుంటున్నామని. అయితే వీటి శాంపిల్స్‌ సేకరించిన వైద్యులు దానిపై పరిశోదన చేస్తున్నారని తెలిపారు. వాటి ఫలితాలు వెలువడితే కానీ వాళ్లు చేస్తున్న దాడుల వెనక అసలు కారణంగా ఏంటనేది తెలీదని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఈ దాడుల గురించి ముందే కొంతమంది సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మ్యూజిక్‌ ఫెస్ట్‌లో మహిళలను లక్ష్యంగా చేసుకొని సిరంజిలతో దాడులు చేయమని స్నాప్‌చాట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్‌లను గుర్తించినట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ దాడుల గురించి ముందే హెచ్చరించా కూడా దాడులు భారీగా గుముగూడారు. మెట్జ్‌లో జరిగిన మ్యాజికల్‌ ఈవెంట్‌కు సుమారు 50,000 మందికిపైగా హాయరయ్యారు.

అయితే, ఈశాన్య ఫ్రాన్స్‌లోని మెట్జ్‌లో ఉన్న ‘రూ డు పలైస్‌’ ‘స్ట్రీట్‌లో ఈ నెల 22న తొలి సిరంజి దాడి నమోదైంది. ఈ దాడులతో సంబంధం ఉన్న ఓ అనుమానిత వ్యక్తికి అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించినట్టు మేయర్ ఫ్రాంకోయిస్ గ్రోస్డిడీ వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని అతని పేరు రూ సెర్పెనోయిస్‌లోగా మేయర్ తెలిపారు. నిందితుడి ఫోన్‌ ఆధారంగా ఇతర దాడులకు సంబంధించిన సమాచారం ఆరా తీసుస్తున్నట్టు అధికారులు తెలిపారు.

కాగా ప్రస్తుతం పారిస్‌ నగరంలో ఈ తరహా 13 కేసులు నమోదయ్యాయని.. వాటీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.అయితే ఈ సిరంజి దాడులు ఎందుకు జరుగుతున్నాయి. ఈ దాడుల వెనుక నిర్దిష్టిమైన ఉద్దేశాలు ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ దాడుల వెనక ఉన్న అసలు విషయాన్ని బయటపెడతామని అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..