దశాబ్దాల పాటు కరోనాతో యుద్ధం చేయాల్సిందే.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక..
కరోనా వైరస్‌పై ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌వో మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మహమ్మారి ప్రభావం ఒకటి రెండు ఏళ్లలో కంట్రోల్ కాదని.. దశాబ్దాల పాటు ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ తెలిపారు.

World Will Face Coronna Till Decades: కరోనా వైరస్ పై ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌వో మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మహమ్మారి ప్రభావం ఒకటి రెండు ఏళ్లలో కంట్రోల్ కాదని.. దశాబ్దాల పాటు ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ తెలిపారు. వైరస్ వెలుగులోకి వచ్చి ఆరు నెలలు అయిన సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో అత్యవసర విభాగం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడకం, సామూహిక ప్రదేశాలు మూసివేయడం వంటి చర్యలను ప్రపంచదేశాలు కొనసాగించాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
శతాబ్దానికి ఒకసారి వెలుగులోకి వచ్చే ఇలాంటి మహామ్మారుల ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ వెల్లడించారు. ఇంకా చాలామందికి వైరస్ ముప్పు ఉందని.. ఇప్పటికే సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో మరోసారి విజృంభించే అవకాశం ఉందని బాంబు పేల్చింది.