Hyderabad: అనారోగ్యం అంటూ యోగా గురువు వద్దకు ఇద్దరు మహిళలు.. తర్వాత అసలు సినిమా
హైదరాబాద్‌కు చెందిన యోగా గురువు రంగారెడ్డి హనీట్రాప్‌లో చిక్కుకున్నారు. చేవెళ్లలో యోగాశ్రమం నిర్వహిస్తున్న ఆయనను, అనారోగ్య సమస్యల పేరుతో ఇద్దరు మహిళలు దగ్గరయ్యారు. తర్వాత సన్నిహిత ఫొటోలు, వీడియోలతో అమర్ గ్యాంగ్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. ఇప్పటికే రూ.50 లక్షల చెక్కులు ఇచ్చిన రంగారెడ్డిని, మరో రూ.2 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి చేసింది.
వాయిస్ః రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఉన్న యోగా ఆశ్రమమిది. రోజూ వందలాది మంది వచ్చిపోయే ప్రాంగణమిది. రంగారెడ్డి అనే ఓ యోగా గురువు ఈ ఆశ్రమాన్ని ఎన్నో ఏళ్లుగా నడుపుతున్నాడు. ఇక యోగా ఆశ్రమం అనగానే దేశ, విదేశాల నుంచి ఎంతో మంది వస్తుంటారు…! వచ్చినవాళ్లు పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంటారు…! ఇదే విషయాన్ని కొన్నాళ్లుగా గమనించిన అమర్ అండ్ గ్యాంగ్. ఎలాగైనా యోగా గురువు దగ్గరున్న డబ్బును ఈజీగా కొట్టేయాలని పక్కా ప్లాన్ వేసింది.
అట్లాంటిట్లాంటి ప్లాన్ కాదిది…! గట్టిగా ఇరికించాలి… దండిగా డబ్బు రాబట్టాలంటూ ఇద్దరు మహిళలతో యోగా గురువు రంగారెడ్డిపై హానీ ట్రాప్ వల విసిరింది అమర్ గ్యాంగ్. బాగా ట్రైన్ చేసి అనారోగ్య సమస్యల పేరుతో ఇద్దరు మహిళలను ఆశ్రమంలోకి పంపింది. ఇక ఆశ్రమంలోకి దిగిన కొన్నిరోజులకే ఆ మహిళలు రంగారెడ్డితో క్లోజ్‌గా మూవ్ కావడం మొదలుపెట్టారు. నకిలీ ప్రెస్ కార్డులతో కొన్న స్పై కెమెరాలు వాడి రంగారెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలు తీశారు. ఇకా వీడియోలను అమర్ గ్యాంగ్‌కు పంపారు. ఇకప్పుడు రంగంలోకి దిగిన గ్యాంగ్.. గురువును బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది . మొదట 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు… అయితే వాటికి సంబంధించిన చెక్కులను వాళ్లకిచ్చాడు రంగారెడ్డి. ఆ తర్వాత కోట్లకు ప్లాన్ వేశారు కేటుగాళ్లు. రెండు కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇక పరిస్థితి గమనించిన గురువు గంగారెడ్డి తానో మాస్టర్ ప్లాన్ వేసి అమర్ గ్యాంగ్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు.
రెండు కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడు రంగారెడ్డి. డబ్బులు ఇచ్చేందుకు గొల్కొండకు రావాలని అటు అమర్ గ్యాంగ్‌ను పిలిచాడు… ఇటు పోలీసులకు సమాచారమిచ్చాడు. ఫలితంగా అమర్ గ్యాంగ్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. అమర్‌తోపాటు మౌలాలి, రాజేష్, మంజుల, రజినీలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. నిందితులు అంతా రియల్ ఎస్టేట్‌లో ఉన్నట్లు గుర్తించారు. ట్రాప్ చేయడం ఇదే మొదటిసారా… ఇలానే ఇంకేమైనా చేశారా..? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

