చేయని నేరానికి 37 ఏళ్ల జైలు.. రూ.116 కోట్లు పరిహారం

చేయని నేరానికి 37 ఏళ్ల జైలు.. రూ.116 కోట్లు పరిహారం

Phani CH

|

Updated on: Feb 19, 2024 | 8:44 PM

ప్రపంచవ్యాప్తంగా ఎందరో నిర్దోషులు తాము చేయని నేరానికి జైళ్లల్లో మగ్గుతున్నారు. విచారణల్లో జరిగే తప్పుల వల్ల.. అసలైన దోషులకు పడాల్సిన శిక్ష, నిర్దోషులకు పడుతోంది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కూడా తాను చేయని అత్యాచారానికి 37 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. మొదటి నుంచి తాను తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా, పాపం అతని గోడు ఎవ్వరూ వినలేదు. చివరికి ఈ కేసులో దొరికిన ఓ సాక్ష్యం ఆధారంగా.. అసలు నేరస్తుడు అతడు కాదని గుర్తించి, అతడ్ని జైలు నుంచి విడుదల చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఎందరో నిర్దోషులు తాము చేయని నేరానికి జైళ్లల్లో మగ్గుతున్నారు. విచారణల్లో జరిగే తప్పుల వల్ల.. అసలైన దోషులకు పడాల్సిన శిక్ష, నిర్దోషులకు పడుతోంది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కూడా తాను చేయని అత్యాచారానికి 37 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. మొదటి నుంచి తాను తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా, పాపం అతని గోడు ఎవ్వరూ వినలేదు. చివరికి ఈ కేసులో దొరికిన ఓ సాక్ష్యం ఆధారంగా.. అసలు నేరస్తుడు అతడు కాదని గుర్తించి, అతడ్ని జైలు నుంచి విడుదల చేశారు. తాను చేయని నేరానికి ఏకంగా 37 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన బాధితుడికి పరిహారంగా 116 కోట్ల రూపాయలు చెల్లించాలని అమెరికాలోని ఓ కోర్టు ఆదేశించింది. లైంగికదాడి, హత్య వంటి ఆరోపణలపై ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్‌ డుబోయిస్‌ను 1982లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటికి అతని వయసు 18 ఏళ్లు. మొదట అతడికి కోర్టు మరణశిక్ష విధించింది. అనంతరం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నల్లమలలో తప్పతాగి చిందులేసిన అటవీ అధికారులు.. వీడియో వైరల్

సమ్మర్‌లో బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ఒక్క గ్లాస్ ఇది తాగండి

Pomegranate: దానిమ్మజ్యూస్‌తో గుండెపోటుకు చెక్‌

మార్చి 15 తర్వాత పేటీఎం క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులు పనిచేస్తాయా

గ్యాస్ సిలిండర్ లో నీళ్లు.. ఎందుకొచ్చాయ్ ?? ఎలా వచ్చాయ్ ??