గ్యాస్ సిలిండర్ లో నీళ్లు.. ఎందుకొచ్చాయ్ ?? ఎలా వచ్చాయ్ ??

గ్యాస్ సిలిండర్ లో నీళ్లు.. ఎందుకొచ్చాయ్ ?? ఎలా వచ్చాయ్ ??

Phani CH

|

Updated on: Feb 19, 2024 | 8:31 PM

ఈ మధ్యకాలంలో గ్యాస్ సిలిండలలో గ్యాస్ కి బదులు నీరు రావడం సర్వసాధారణం అయిపోయింది. అది ఏజెన్సీల తప్పా లేక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల పొరపాటో తెలియదు గానీ దానివల్ల వినియోగదారులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. గ్యాస్ కి బదులు నీరు వచ్చిందని ఏజెన్సీల దగ్గరకు పోతే వారు మేమేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా కడప జిల్లాలో కూడా జరిగింది. కడప జిల్లాలోని చెన్నూరు మండలంలో..

ఈ మధ్యకాలంలో గ్యాస్ సిలిండలలో గ్యాస్ కి బదులు నీరు రావడం సర్వసాధారణం అయిపోయింది. అది ఏజెన్సీల తప్పా లేక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల పొరపాటో తెలియదు గానీ దానివల్ల వినియోగదారులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. గ్యాస్ కి బదులు నీరు వచ్చిందని ఏజెన్సీల దగ్గరకు పోతే వారు మేమేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా కడప జిల్లాలో కూడా జరిగింది. కడప జిల్లాలోని చెన్నూరు మండలంలో గల రామన్న పల్లె గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డి రెండు నెలల క్రితం గణేష్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ లో సిలిండర్‌ బుక్ చేశాడు. సిలిండర్‌ డెలివరీ తీసుకున్న తర్వాత వేరే సిలిండర్‌లో గ్యాస్‌ అయిపోవడంతో ఈ సిలిండర్‌ గ్యాస్‌ పొయ్యికి కనెక్ట్‌ చేశాడు. ఎంతకూ పొయ్యి వెలగకపోవడంతో అనుమానం వచ్చి గ్యాస్ సిలిండర్‌ని చెక్‌ చేశాడు. అటూ ఇటూ కదిలించగా అందులో నీళ్లు ఉన్న శబ్ధం వచ్చింది. సిలిండర్‌ రివర్స్ చేయగా అందులో నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. అది వీడియో తీసి గ్యాస్‌ ఏజెన్సీ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. మాకేమీ తెలియదని, గ్యాస్‌ రీ ఫిల్‌ చేసి ఇవ్వడం కుదరదని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టికెట్‌ లేకుండా విమానం ఎక్కేసింది.. ఆ తర్వాత ??

ఇంటి గుమ్మంలో నల్ల చిరుత… ఇంతకీ తలుపు కొట్టిందా ?? లేదా ??

వందే భారత్‌ రైలుకు “కవచ్‌” రక్ష.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, పాల్వాల్‌ మధ్య పరీక్ష