టికెట్‌ లేకుండా విమానం ఎక్కేసింది.. ఆ తర్వాత ??

టికెట్‌ లేకుండా విమానం ఎక్కేసింది.. ఆ తర్వాత ??

Phani CH

|

Updated on: Feb 19, 2024 | 8:28 PM

అమెరికాలోని ఓ మహిళ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ కన్నుగప్పి టిక్కెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కింది. నాష్‌విల్లే విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు లేకుండా లాస్ ఏంజెల్స్‌కు వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కింది. ప్రతీ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ను ఎంతో చాకచక్యంగా చెకింగ్‌లో దొరక్కుండా దాటేసింది. ఆమె అలా 5 గంటలు ప్రయాణం చేసిన తర్వాత గానీ ఎయిర్‌పోర్టు వారు టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించలేకపోయారు.

అమెరికాలోని ఓ మహిళ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ కన్నుగప్పి టిక్కెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కింది. నాష్‌విల్లే విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు లేకుండా లాస్ ఏంజెల్స్‌కు వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కింది. ప్రతీ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ను ఎంతో చాకచక్యంగా చెకింగ్‌లో దొరక్కుండా దాటేసింది. ఆమె అలా 5 గంటలు ప్రయాణం చేసిన తర్వాత గానీ ఎయిర్‌పోర్టు వారు టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించలేకపోయారు. న్యూయార్క్ పోస్ట్‌ వివరాల ప్రకారం ఆ మహిళా ప్రయాణికురాలు నాష్‌విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ స్క్రీనింగ్ లైన్‌లోని మానవరహిత ప్రాంతంలో అడ్డంకిని దాటారు. ఇక్కడ ప్రయాణీకులు తమ గుర్తింపును చూపించవలసి ఉంటుంది. దీనిపై విమానాశ్రయ అధికారులు విచారణ ప్రారంభించారు. నాష్‌విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో ఆ ప్రయాణికురాలితో పాటు ఆమె క్యారీ ఆన్ బ్యాగేజీని ఫ్లైట్ ఎక్కే ముందు చెక్‌ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఈ ఘటనలో తమ పొరపాటును అంగీకరించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి గుమ్మంలో నల్ల చిరుత… ఇంతకీ తలుపు కొట్టిందా ?? లేదా ??

వందే భారత్‌ రైలుకు “కవచ్‌” రక్ష.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, పాల్వాల్‌ మధ్య పరీక్ష