పుట్టుకతోనే  నాన్‌ వెజ్‌ రైస్‌ ఇవి.. 8 శాతం అధిక ప్రొటీన్లు, 7 శాతం అధిక కొవ్వుతో వచ్చేస్తోంది

పుట్టుకతోనే నాన్‌ వెజ్‌ రైస్‌ ఇవి.. 8 శాతం అధిక ప్రొటీన్లు, 7 శాతం అధిక కొవ్వుతో వచ్చేస్తోంది

Phani CH

|

Updated on: Feb 19, 2024 | 8:46 PM

ఆహారం ద్వారా అధిక ప్రోటీన్లు పొందాలనుకొనేవారికి శుభవార్త. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రీడ్‌ నాన్‌వెజ్‌ రైస్‌ బియ్యాన్ని సృష్టించారు. ఈ బియ్యంలో పశు మాంసం, కొవ్వు కణాలుండేలా ప్రయోగశాలలో సాగు చేసారు. ఇందుకోసం ముందుగా బియ్యానికి చేపల నుంచి తీసిన జిగురు లాంటి పదార్థాన్ని పూసారు. దీనివల్ల పశు మాంస కణాలు దానికి అతుక్కుపోయాయి. తర్వాత వాటిని 11 రోజుల పాటు ల్యాబ్‌లో కృత్రిమంగా సాగు చేసారు.

ఆహారం ద్వారా అధిక ప్రోటీన్లు పొందాలనుకొనేవారికి శుభవార్త. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రీడ్‌ నాన్‌వెజ్‌ రైస్‌ బియ్యాన్ని సృష్టించారు. ఈ బియ్యంలో పశు మాంసం, కొవ్వు కణాలుండేలా ప్రయోగశాలలో సాగు చేసారు. ఇందుకోసం ముందుగా బియ్యానికి చేపల నుంచి తీసిన జిగురు లాంటి పదార్థాన్ని పూసారు. దీనివల్ల పశు మాంస కణాలు దానికి అతుక్కుపోయాయి. తర్వాత వాటిని 11 రోజుల పాటు ల్యాబ్‌లో కృత్రిమంగా సాగు చేసారు. నాన్‌ వెజ్‌ రైస్‌లో సాధారణ బియ్యం కంటే 8 శాతం అధిక ప్రొటీన్లు, 7 శాతం అధిక కొవ్వు ఉన్నట్లుగా తేలింది. ఈ బియ్యం అందుబాటులో ధరలో, పర్యావరణ హితంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మేటర్‌ జర్నల్‌ ప్రచురించిన కథనం ప్రకారం కరువు పరిస్థితుల్లో, సైనిక రేషన్‌లా, అంతరిక్ష ఆహారంగా ఈ నాన్‌వెజ్‌ రైస్‌ని వాడవచ్చు. ప్రయోగశాలలో తయారయ్యే ఈ బియ్యం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, మాంసం కోసం పశువుల్ని పెంచే అవసరం తప్పుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ రకంగా ఇవి పర్యావరణ హితమైనవనీ విశ్లేషిస్తున్నారు. అయితే ఈ బియ్యాన్ని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేయని నేరానికి 37 ఏళ్ల జైలు.. రూ.116 కోట్లు పరిహారం

నల్లమలలో తప్పతాగి చిందులేసిన అటవీ అధికారులు.. వీడియో వైరల్

సమ్మర్‌లో బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ఒక్క గ్లాస్ ఇది తాగండి

Pomegranate: దానిమ్మజ్యూస్‌తో గుండెపోటుకు చెక్‌

మార్చి 15 తర్వాత పేటీఎం క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులు పనిచేస్తాయా