స్పేస్‌లో వీకాఫ్ ఎంజాయ్ చేసిన సునీతా విలియమ్స్
ప్రఖ్యాత నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తన సహోద్యోగులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో వీక్ ఆఫ్‌ను ఎంజాయ్ చేశారు. కాగా నాసా వ్యోమగాములకు వీక్ ఆఫ్ ప్రకటించడంతో వారు స్టార్‌లైనర్‌లోకి వెళ్లి సరదాగా గడిపారు. తమ కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడారు. గేమ్స్ ఆడుతూ, అంతరిక్షం నుంచి భూమిని చూస్తూ సందడి చేశారు. 10 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్ ఈ రోదసీ యాత్ర చేపట్టారు.
ప్రఖ్యాత నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తన సహోద్యోగులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో వీక్ ఆఫ్‌ను ఎంజాయ్ చేశారు. కాగా నాసా వ్యోమగాములకు వీక్ ఆఫ్ ప్రకటించడంతో వారు స్టార్‌లైనర్‌లోకి వెళ్లి సరదాగా గడిపారు. తమ కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడారు. గేమ్స్ ఆడుతూ, అంతరిక్షం నుంచి భూమిని చూస్తూ సందడి చేశారు. 10 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్ ఈ రోదసీ యాత్ర చేపట్టారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో భూమిపై ల్యాండింగ్‌ను వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా.. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. సమస్యలు ఉన్నప్పటికీ వ్యోమగాములు సురక్షితంగా ఉన్నారని, ఐఎస్‌ఎస్‌లో వారికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయని నాసా తెలిపింది. సునీతా విలియమ్స్‌కు ఇది మూడో రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్ కూడా చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డ్యాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆహారం కావాలంటే సైనికుల కోర్కెలు తీర్చాల్సిందే
Kangana Ranaut: చిక్కుల్లో కంగన.. ఇప్పుడు ఎంపీ గారి పరిస్థితేంటి మరి ??
Salman Khan: స్టార్ హీరోకు ప్రాణ భయం.. అతడే నన్ను చంపాలనుకున్నాడు
ఏడాదికి రూ.2 కోట్ల జీతం.. సల్మాన్ బాడీగార్డ్ అంటే మామూలుగా ఉండదు చిన్నా
TOP 9 ET News: రేవంత్, చంద్రబాబు చేతుల మీదుగా బాలయ్యకు సన్మానం