Viral Video: బాబోయ్‌! రూ.75 లక్షల కోట్లు విలువ చేసే ప్లాటినం నాణెం! ముద్రిస్తోంది ఏ దేశమో తెలుసా? వీడియో

అమెరికా ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణాన్ని ముద్రించనుంది. దీని విలువ ఒక ట్రిలియన్‌ డాలర్లు.. అంటే దాదాపు 75లక్షల కోట్ల రూపాయలన్నమాట. రుణ నియంత్రణ సంక్షోభాన్ని ఈ కాయిన్‌తో ఎదుర్కోవాలని అమెరికా భావిస్తోంది.

Viral Video: బాబోయ్‌! రూ.75 లక్షల కోట్లు విలువ చేసే ప్లాటినం నాణెం! ముద్రిస్తోంది ఏ దేశమో తెలుసా? వీడియో

|

Updated on: Oct 12, 2021 | 9:56 PM

అమెరికా ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణాన్ని ముద్రించనుంది. దీని విలువ ఒక ట్రిలియన్‌ డాలర్లు.. అంటే దాదాపు 75లక్షల కోట్ల రూపాయలన్నమాట. రుణ నియంత్రణ సంక్షోభాన్ని ఈ కాయిన్‌తో ఎదుర్కోవాలని అమెరికా భావిస్తోంది. దీనిని ముద్రించేందుకు బైడెన్‌ సర్కార్‌ సిద్దపడుతోంది. కానీ, ఆర్థిక నిపుణులు మాత్రం అమెరికా కరెన్సీ విలువ దెబ్బతింటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ట్రెజరీ బాండ్లను ఎంతవరకు సంపాదించాలి అనే దానిపై నిబంధనే డెట్‌సీలింగ్‌ అంటారు. ఈ సొమ్మును వివిధ ఆర్థిక కార్యకలాపాలకు వినియోగిస్తారు. దీనికి కాంగ్రెస్‌ అనుమతి ఉండాలి. లేకపోతే ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కంటే వెచ్చించే మొత్తం ఎక్కువైపోతుంది. 1917లో తొలిసారి దీనిని అమెరికా ప్రవేశపెట్టింది. కానీ, 1960 తర్వాత నుంచి డెట్‌సీలింగ్‌ను 78 సార్లు పెంచారు. ప్రస్తుతం 22 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈ మొత్తాన్ని 28.5 మిలియన్‌ డాలర్లకు పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: దోమ గుడ్డు పెట్టడం ఎప్పుడైనా చూశారా..? ఇప్పుడు చూడండి.. వీడియో

Viral Video: వింత శబ్దం చేస్తున్నపాము.. వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది! వీడియో

Follow us