అమెరికాలో ఇక ఆ పెళ్లిళ్లకు లైన్ క్లియర్.. బిల్లుపై బైడెన్ సంతకం..

అమెరికాలో ఇక ఆ పెళ్లిళ్లకు లైన్ క్లియర్.. బిల్లుపై బైడెన్ సంతకం..

Phani CH

|

Updated on: Dec 21, 2022 | 8:15 PM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం కీలక బిల్లుకు ఆమోదముద్ర వేశారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే బిల్లు..సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్‌పై ఆయన సంతకం చేశారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం కీలక బిల్లుకు ఆమోదముద్ర వేశారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే బిల్లు..సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్‌పై ఆయన సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఇప్పటికే అమెరికా సెనేట్‌లో, ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు వ్యతిరేకంగా ముందుగా సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్న ఆందోళనతో.. అమెరికన్ సెనేట్ ఈ సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్లుకు ఆమోదం తెలిపింది. అధికార డెమోక్రాట్ పార్టీతోపాటు కొందరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో బిల్లు సెనేట్‌లో సులువుగా పాసైంది. సెనేట్‍లో ఆమోదం పొందిన స్వలింగ సంపర్కుల వివాహ రక్షణ బిల్లు ఆ తర్వాత ప్రతినిధుల సభకు చేరింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 258-169తో మెజారిటీ దక్కింది. డెమొక్రాట్లు మొత్తం సభ్యులు, రిపబ్లికన్లలో 39 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పైలట్లే కూల్చేశారా ?? తాజాగా దొరికిన విమాన తలుపు !!

అమ్మా..నువ్వు దేవతవి అంతే.. ఉద్యోగులకు రూ. 80 లక్షల బోనస్ ప్రకటించిన లేడీ బాస్..

ఇండియాలోనే అత్యంత కాస్ల్టీ కారు కొన్న హైదరాబాదీ !! ధర తెలిస్తే షాక్ !!

ఓర్నీ.. ఈ వయసులో మీకిదేం పిచ్చిరా సామీ !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్‌ వీడియో

రైల్వే కూలీ నుంచి ఐఏఎస్‌గా.. వెరీ ఇంట్రెస్టింగ్‌ !!

 

Published on: Dec 21, 2022 08:15 PM