త్వరలో కూలనున్న కొండచరియ !! జ్ఞాపకాలతో గ్రామం ఖాళీ చేస్తున్న ప్రజలు

త్వరలో కూలనున్న కొండచరియ !! జ్ఞాపకాలతో గ్రామం ఖాళీ చేస్తున్న ప్రజలు

Phani CH

|

Updated on: May 22, 2023 | 9:43 PM

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వ యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. కొద్దిరోజులు తమ ప్రాంతాన్ని వీడి వెళ్లాలంటే అక్కడి ప్రజలు ఎంతో ఆవేదన చెందుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్లి.. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి వస్తుంటారు.

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వ యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. కొద్దిరోజులు తమ ప్రాంతాన్ని వీడి వెళ్లాలంటే అక్కడి ప్రజలు ఎంతో ఆవేదన చెందుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్లి.. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి వస్తుంటారు. తాజాగా, ఓ కొండచరియ ఎప్పుడు ఊడిపడుతుందో తెలియక స్విట్జర్లాండ్‌ అధికారులు ఓ గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ఎన్నో వందల ఏళ్లుగా అక్కడ జీవిస్తున్న వందల కుటుంబాలు ఆ ప్రాంతంతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గ్రామాన్ని ఖాళీ చేస్తున్నాయి. కార్లు, ట్రక్‌లు, పికప్‌ ట్రక్‌ల సాయంతో చిన్నా, పెద్దా.. తమ పెంపుడు జంతువులతో సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిపోతున్నారు. తూర్పు స్విట్జర్లాండ్‌లో బ్రియేంజ్‌ ప్రాంతంలోని ఆల్ఫ్‌ పర్వత శ్రేణుల్లో ఓ గ్రామంలో ప్రజలు ఎన్నో వందల ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం గ్రామం దగ్గర్లో భూమిలో వింత శబ్దాలు రావడంతో భూగర్భ శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని పరీక్షించారు. తర్వాత కొద్దిరోజులకు ఆల్ఫ్‌ పర్వతశ్రేణుల్లోని రెండు మిలియన్‌ క్యూబిక్‌ మీటర్‌ వ్యాసం కలిగిన ఓ కొండచరియ విరిగి గ్రామంపై పడబోతోందని గుర్తించారు. ఈ గ్రామంలో జర్మన్‌, రోమన్‌ మూలాలు కలిగిన ప్రజలు నివస్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా హిమనీనదాలు కరిగిపోవడం వల్ల పర్వత శ్రేణుల్లోని భూగర్భ శిలజాలాలు కదిలిపోయి కొండచరియలు విరిగిపడిపోతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దాహం తీర్చిన మహిళకు ఊహించని షాక్‌ ఇచ్చిన తాబేలు !! ఏంచేసిందో చూడండి

Digital TOP 9 NEWS: మణిపూర్‌లో మళ్ళీ హింస | కశ్మీర్‌లో రామ్‌చరణ్ సందడి

Ram Gopal Varma: కేరళ స్టోరీపై రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ కామెంట్స్

Salaar: హాలీవుడ్ లెవల్‌లో ‘సలార్’ క్లైమాక్స్‌..