Hajj Pilgrims: హజ్ యాత్రలో మృత్యుఘోష.. 550 మందికి పైగా మృతి. ఎందుకంటే.?
పవిత్ర హజ్ యాత్రలో ఎండ తీవ్రరూపం దాలుస్తోంది. ఎండలు, ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. ఎండ వేడిమికి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతిచెందారని మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. ఇక చనిపోయిన వారిలో ఈజిప్ట్, జోర్డాన్ దేశస్తులు అధికంగా ఉన్నారు.
పవిత్ర హజ్ యాత్రలో ఎండ తీవ్రరూపం దాలుస్తోంది. ఎండలు, ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. ఎండ వేడిమికి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతిచెందారని మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. ఇక చనిపోయిన వారిలో ఈజిప్ట్, జోర్డాన్ దేశస్తులు అధికంగా ఉన్నారు. సుమారు 323 మంది ఈజిప్టియన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 60 మంది జోర్డానియన్లు కూడా మరణించారని తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 577కి చేరినట్లు తెలుస్తోంది. వీరంతా వేడి సంబంధిత సమస్యలతోనే మరణించినట్లు వెల్లడించారు. వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం తప్పడం లేదు. ఇక మక్కాలోని అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటైన అల్-ముయిసెమ్ ఆసుపత్రి మార్చురీలో మొత్తం 550 మృతదేహాలు ఉన్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. వేడి సంబంధిత సమస్యలతో బాధపడిన సుమారు 2,000 మంది యాత్రికులకు చికిత్స అందించినట్లు సౌదీ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం మక్కాలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద సోమవారం 51.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో హజ్ యాత్రకు వెళ్లిన భక్తుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రతి దశాబ్దం సౌదీ అరేబియాలో 0.4 డిగ్రీల వేడి పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఈ హజ్ యాత్ర జూన్ 19వ తేదీతో ముగుస్తుంది. ఇక గతేడాది కూడా హజ్ యాత్రలో 240 కి పైగా మరణాలు నమోదయ్యాయి. ఈ మతపరమైన కార్యక్రమం ద్వారా సౌదీ అరేబియా ఏడాదికి 12 బిలియన్ డాలర్లు ఆర్జిస్తోంది. విజన్ 2030 రోడ్‌మ్యాప్‌లో భాగంగా సౌదీ అరేబియా 2030 నాటికి హజ్, ఉమ్రా రెండింటి ద్వారా మతపరమైన పర్యాటకుల సంఖ్యను 30 మిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ యాత్రలు చేసే పర్యాటకులు ఆహారం, ప్రయాణం, వసతి, ఇతర వాటికి వెచ్చించే నగదుతో ఆ దేశ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతోంది. కాగా, హజ్ ఖర్చు ఒక వ్యక్తికి 3వేల డాలర్ల నుంచి 10వేల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.