Nobel Peace Prize 2025: హక్కుల నేత మరియాకు నోబెల్ పీస్ ప్రైజ్.. పాపం ట్రంప్ అంటున్న ప్రపంచం
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 మరియా కొరీనా మచాడోకు దక్కింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గానూ ఆమెకు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. వెనెజులా పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న మరియా.. వెనెజులాలో శాంతి స్థాపనకు మరీనా కొరినా పాటుపడ్డారని, నియంతృత్వం నుంచి దేశాన్ని ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేయించారని నోబెల్ ట్రస్ట్ ప్రకటించింది.
దేశంలోని అందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటేసేలా ఆమె కృషి చేశారని నోబెల్ ట్రస్ట్ కొనియాడింది. వెనిజులాలో ప్రజాస్వామ్య జ్వాలలను వెలిగిస్తూ.. ధైర్యవంతమైన, నిబద్ధత కలిగిన శాంతి విజేత అంటూ మచాడోపై సదరు కమిటీ ప్రశంసల జల్లు కురిపించింది. దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం తన అలుపెరగని పోరాటంతో ఆమె ఈ ఏడాది ప్రపంచాన్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన తొలి 100 మంది వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. మరోవైపు నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరినా ఎంపిక కావడంతో.. ఆ బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ అయ్యారు. నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కిన నాటి నుంచి ఆయన తహతహలాడిపోతున్నారు. భారత్-పాక్ యుద్ధంతో పాటు అర్మేనియా-అజర్బైజాన్ యుద్ధం, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, కాంబోడియా-థాయ్‌లాండ్ యుద్ధం, సెర్బియా -కొసోవో యుద్ధం, ఈజిప్ట్ ఇథోపియా యుద్ధం, ర్వాండా-కాంగో యుద్ధాలను ఒంటి చేత్తో ఆపానని ట్రంప్ కొన్నాళ్లుగా పదేపదే చెప్పుకుంటూ వచ్చారు. అసలు.. నోబెల్ శాంతి బహుమతికి ఇంతకంటే ఏం అర్హత కావాలో చెప్పాలని ప్రశ్నలు గుప్పించారు. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోతే.. అమెరికాను అవమానించినట్లేనని కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారు. మరికొద్ది సేపట్లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటిస్తారనగా రష్యా కీలక ప్రకటన చేసింది. ఈ పురస్కారం కోసం ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించింది. ట్రంప్‌నకు మద్దతుగా ఈ ప్రకటనను రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి యూరి ఉషకోవ్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని అపేందుకు చేసిన ట్రంప్ యత్నాలను రష్యా పలుమార్లు అభినందించింది. ఈ క్రమంలో చివరి నిమిషంలో ట్రంప్‌కు రష్యా మద్దతు పలికినా.. ఉపయోగం లేకపోయింది. ఈ నేపథ్యంలో నోబెల్ కమిటీ ఒక ప్రకటన చేసింది. ప్రత్యేకమైన అర్హతలు ప్రతి నామినీకి ఉన్నాయని, అయితే.. బయటి ప్రచారం తమ కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేయదని తెలిపింది. ఈ ఐదుగురు సభ్యుల కమిటీని నార్వే పార్లమెంట్ నియమిస్తుందని..వారు పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తూ నామినేషన్లను పరిశీలిస్తారని ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపావళికి క్యూ కట్టిన సౌత్ సినిమాలు.. బిజీ బిజీగా బాక్సాఫీస్
వైరల్ అవుతున్న మెగాస్టార్ నయా లుక్.. ఫ్యాన్స్‌కు పండగేనా
మాట మార్చిన మహేష్.. గ్లోబల్ మూవీలో మాస్ నెంబర్‌కు రెడీ అవుతున్న సూపర్ స్టార్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

