పాక్‌కు అమెరికా AIM 120 క్షిపణులు.. వీటితోనే గతంలో భారత్‌పై దాడి
మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంతో భారత్ ఎప్పటికప్పుడు తన సైనిక బలాన్ని మెరుగుపరుచుకుంటోంది. ఈ క్రమంలోనే పలు అధునాతన క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్లు, డ్రోన్ల ప్రాజెక్టులపై కేంద్ర రక్షణ శాఖ..స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే హైపర్‌సోనిక్ మిస్సైల్స్ ప్రయోగాలను స్పీడప్ చేసింది. ఆపరేషన్ సింధూర్‌లో కీలకంగా మారిన బ్రహ్మోస్ మిస్సైల్ కంటే పవర్‌ఫుల్ హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్-HGVని తీసుకురాబోతుంది.
ముద్దుగా..‘ధ్వని’అని పిలిచే ఈ క్షిపణిని.. డిసెంబరులోకా పరీక్షించి.. ఆర్మీకి అప్పగించాలని DRDO నిర్ణయించింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్‌తో దెబ్బతిన్న పాకిస్థాన్.. పరువు దక్కించుకునేందుకు.. అగ్రరాజ్యం అమెరికా కాళ్లమీద పడి మిస్సైల్స్‌ను అడుక్కుంటోంది. ఈ క్రమంలో అత్యాధునిక ఏఐఎమ్-120 క్షిపణులను పాకిస్థాన్‌కు అమెరికా అందించనున్నట్టు తెలిపింది. ఇవి గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే మధ్యశ్రేణి క్షిపణులుగా భావిస్తున్నారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఈ ఏడాది మేలో యుద్ధ విరమణ తర్వాత అమెరికాకు దగ్గరయ్యేందుకు పాక్ పాలకులు నానా పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే రష్యా నుంచి భారత్ చమురు కొంటోందనే సాకు చూపి.. అమెరికా అధ్యక్షుడు భారత్ మీద సుంకాల యుద్దం ఆరంభించారు. పనిలో పనిగా భారత్ ప్రత్యర్థి అయిన.. పాకిస్థాన్‌ను చేరదీస్తున్నట్లుగా ట్రంప్ సంకేతాలు పంపారు. దీంతో.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీచీఫ్ ఆసిం మునీర్‌లు ఉన్నట్లుండి.. అమెరికాను సందర్శించారు. వైట్ హౌస్‌లో ట్రంప్‌తో ములాఖత్ అయ్యారు. ఆ సమయంలోనే భారీ ఆయుధ ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఇదే పని మీద గత జూలైలో పాకిస్థాన్ వాయుసేన చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా కుదిరిన ఆయుధ ఒప్పందాన్ని ధ్రువీకరిస్తూ అమెరికా రక్షణశాఖ నోటిఫికేషన్ జారీచేసినట్టు సమాచారం. ఆ నోటిఫికేషన్‌లో ఏఐఎమ్-120 కొనుగోలుదారుల జాబితాలో తక్కిన దేశాలతోపాటు పాక్ పేరును కూడా అమెరికా చేర్చిందంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. డాన్ పత్రిక కథనం ప్రకారం.. ఏఐఎమ్-120లో సీ8, డీ అనే రెండు రకాల క్షిపణలున్నాయి. ఇందులో డీ రకం క్షిపణులను ఇప్పటికే అమెరికా సైన్యం వాడుతుండగా, వాటికంటే.. సీ8 మరింత ఆధునికమైనది. వీటిని తయారుచేసే ఆయుధ సంస్థకు ఇప్పటికే 41.6 మిలియన్ల డాలర్ల విలువైన ఆర్డర్‌ను ఇచ్చినట్టు అమెరికా రక్షణ శాఖ గత సెప్టెంబరు 30న ప్రకటించిందని డాన్ పత్రిక తెలిపింది. ఈ క్షిపణులు పాక్ సహా కొనుగోలుదేశాలకు 2030 మే నెల నాటికి అందించాలని అమెరికా భావిస్తోంది. అయితే, వీటిలో ఎన్ని పాక్‌కు ఇస్తారనే అంశంపై క్లారిటీ లేదు. అలాగే, పాక్ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలను కూడా అమెరికా ఆధునీకరించే చాన్స్ ఉందని డాన్ కథనం పేర్కొంది. కేవలం పాక్ వాయుసేనలోని ఎఫ్-16లకు మాత్రమే .. ఏఐఎమ్-120 క్షిపణిని అమర్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nobel Peace Prize 2025: హక్కుల నేత మరియాకు నోబెల్ పీస్ ప్రైజ్.. పాపం ట్రంప్ అంటున్న ప్రపంచం
దీపావళికి క్యూ కట్టిన సౌత్ సినిమాలు.. బిజీ బిజీగా బాక్సాఫీస్
వైరల్ అవుతున్న మెగాస్టార్ నయా లుక్.. ఫ్యాన్స్‌కు పండగేనా
మాట మార్చిన మహేష్.. గ్లోబల్ మూవీలో మాస్ నెంబర్‌కు రెడీ అవుతున్న సూపర్ స్టార్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

