Nepal Earthquakes: వరుస భూకంపాలతో అల్లాడుతున్న నేపాల్‌.. మళ్లీ ప్రకంపనలు..

Nepal Earthquakes: వరుస భూకంపాలతో అల్లాడుతున్న నేపాల్‌.. మళ్లీ ప్రకంపనలు..

Anil kumar poka

|

Updated on: Oct 24, 2023 | 8:27 PM

భూకంపాలు నేపాల్‌ను వదలడంలేదు. రెండు రోజుల క్రితం నేపాల్‌ రాజధాని ఖాట్మండులో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదృష్టవశాత్తు ఆస్తి, ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా అక్కడ మరోసారి భూమి కంపించింది. అక్టోబరు 24 తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. వరుస భూకంపాలతో జనం భయభ్రాంతులకు గురయ్యారు.

భూకంపాలు నేపాల్‌ను వదలడంలేదు. రెండు రోజుల క్రితం నేపాల్‌ రాజధాని ఖాట్మండులో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదృష్టవశాత్తు ఆస్తి, ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా అక్కడ మరోసారి భూమి కంపించింది. అక్టోబరు 24 తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. వరుస భూకంపాలతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి, వీధుల్లోనే గడుపుతున్నారు. ఖాట్మండుకు ఉత్తర, ఈశాన్యం దిశగా 393 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. తాజా భూకంపంలోనూ ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. టిబెటన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే నేపాల్‌లో భూకంపాలు సర్వసాధరణంగా మారాయి. శతాబ్దానికి ఒకసారి ఈ రెండు ప్లేట్లు ఒకదానికొకటి రెండుమీటర్ల మేర దగ్గరకు జరుగుతుండడంతో ఒత్తిడి ఏర్పడి భూకంపాలు సంభవిస్తున్నాయి. 2015లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం పెను ప్రళయాన్నే సృష్టించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 24, 2023 08:25 PM