NASA: కృష్ణ బిలం వినిపిస్తోంది.. అచ్చం సముద్ర అలల్లా..!  శబ్దాన్ని విడుదల చేసిన నాసా.. వైరల్‌ వీడియో..

NASA: కృష్ణ బిలం వినిపిస్తోంది.. అచ్చం సముద్ర అలల్లా..! శబ్దాన్ని విడుదల చేసిన నాసా.. వైరల్‌ వీడియో..

Anil kumar poka

|

Updated on: Dec 02, 2022 | 9:30 PM

బ్లాక్ హోల్ అనేది ఎంతో బలమైన గురుత్వాకర్షణ త్వరణాన్ని ప్రదర్శించే స్పేస్‌టైమ్ ప్రాంతం. ఎంత బలమైన గురుత్వాకర్షణ అంటే, దాని ఆకర్షణ నుండి, ఏ కణమూ, చివరికి కాంతి వంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏదీ,


బ్లాక్ హోల్ అనేది ఎంతో బలమైన గురుత్వాకర్షణ త్వరణాన్ని ప్రదర్శించే స్పేస్‌టైమ్ ప్రాంతం. ఎంత బలమైన గురుత్వాకర్షణ అంటే, దాని ఆకర్షణ నుండి, ఏ కణమూ, చివరికి కాంతి వంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏదీ, దాని నుండి తప్పించుకోలేవు. ఏదైనా ద్రవ్యరాశి తగినంత సాంద్రతతో ఉంటే, స్పేస్‌టైమ్‌ను వంచి, కృష్ణ బిలం ను ఏర్పరుస్తుందని సాధారణ సాపేక్షతా సిద్ధాంతం ఊహించింది. ఇదిలా ఉంటే.. ఈ కృష్ణ బిలాలనుంచి నిరంతరం శబ్దాలు వెలువడుతూ ఉంటాయి. అవి ఎలాంటి శబ్దాలు అన్న సంగతి తెలియదు. అయితే ఈ శబ్దాల విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు కొంత పురోగతి సాధించారు. బ్లాక్‌ హోల్‌ నుంచి వచ్చే చిన్నపాటి ప్రతిధ్వనులను రికార్డు చేసి, స్పష్టమైన శబ్దంగా మార్చారు. ఇందుకోసం సొనిఫికేషన్‌ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెబుతున్నారు.తాగాజా బ్లాక్‌ హోల్‌ నుంచి వెలువడే శబ్దాలకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఇది భూమికి 7,800 కాంతి సంత్సరాల దూరంలో ఉన్న వీ404 సైగ్నీ అనే బ్లాక్‌హోల్‌కు సంబంధించినదని తెలిపారు. నాసా విడుదల చేసిన వీడియోకు సోషల్‌ మీడియాలో భారీ స్పందన లభించింది. వీడియో విడుదలైన కొన్ని గంటల్లోనే దాదాపు 50 లక్షల మందికిపైగా వీడియోను వీక్షించారు. కృష్ణ బిలం శబ్దం కొత్తగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. ఇసుకపై నుంచి దూసుకొచ్చే సముద్ర అలల ధ్వనిలా ఉందని కొందరు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్‌ గోల్డ్‌ అంటున్న నెటిజనం..

Massage for Minister: తీహార్‌ జైలు కొత్త ట్విస్ట్‌.. మంత్రి సత్యేంద్రకు మసాజ్‌ చేసింది అతడే వ్యక్తి..! వీడియో

Published on: Dec 02, 2022 09:30 PM