AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌పై అమెరికా ఆలోచనలో మార్పు త్వరలో మోదీతో ట్రంప్‌ భేటీ

భారత్‌పై అమెరికా ఆలోచనలో మార్పు త్వరలో మోదీతో ట్రంప్‌ భేటీ

Phani CH
|

Updated on: Sep 20, 2025 | 2:11 PM

Share

భారత్‌పై కొన్నాళ్లుగా నోరు పారేసుకుంటున్న ట్రంప్‌ అండ్‌ టీమ్‌లో మార్పు వచ్చిందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇండియాను బలవంతంగా లొంగదీసుకోవాలనుకున్న అగ్రరాజ్యంలో దూకుడు తగ్గుతోంది. తమ మాటల యుద్ధం ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదని ట్రంప్‌ యంత్రాంగం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది.

ట్రంప్‌ సన్నిహిత సలహాదారులైన పీటర్‌ నవారో, స్కాట్‌ బెసెంట్, హోవార్డ్‌ లుట్నిక్‌ తదితరులు అదేపనిగా ఇండియాపై చేసిన విమర్శలు బలవంతపు దౌత్యంలా ఉన్నాయి. అయితే, ఇప్పుడు భారత్‌ ప్రతిదానికీ స్పందించడం మానేసింది. అమెరికా దూషణలపై బహిరంగంగా ప్రతిదాడి చేయడం లేదు. అమెరికాపై ప్రతీకార సుంకాలనూ విధించలేదు. వ్యూహాత్మక మౌనాన్నే ఆశ్రయించింది. ఈ సంయమనమే అమెరికాను ఆలోచనలో పడేలా చేసిందనేది పరిశీలకుల మాట. షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోదీ చైనా, రష్యా అగ్ర నేతలతో స్నేహపూర్వకంగా కలిసిపోవడం ట్రంప్‌ను వెనకడుగు వేసేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. జిన్‌పింగ్, పుతిన్‌లతో మోదీ కరచాలనం చేస్తున్న దృశ్యాలు అమెరికా అధ్యక్షుడు స్పందించేలా చేశాయి. తనకూ ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ ఇండియా వ్యూహాత్మక సంకేతాలివ్వడం వాషింగ్టన్‌ను పునరాలోచనలో పడేలా చేసింది. పశ్చిమ దేశాలకు, అమెరికాకు వ్యతిరేకంగా విస్తరిస్తున్న దేశాల కూటముల మధ్య వారధుల్లో ఒకటిగా ఇండియా నిలుస్తోందన్న సంగతిని ట్రంప్‌ బృందం అర్థం చేసుకుందనే బావన వ్యక్తం అవుతోంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే విషయంలో అమెరికా తంటాలు పడుతూనే ఉంది. ట్రంప్, పుతిన్‌ల మధ్య అత్యున్నత స్థాయిలో అలస్కా భేటీ జరిగినా సంక్షోభ పరిష్కార అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్‌ సంక్షోభంలో అతి తక్కువ పాత్ర కలిగి ఉండే భారత్‌ వంటి తటస్థ దేశాలపై అమెరికా ఒత్తిడి పెంచడం తప్పుడు నిర్ణయంగా అమెరికాలోని మెజార్టీ వర్గం భావిస్తోంది. పెద్దన్న ఒత్తిడికి లొంగడానికి బదులుగా, ఇండియా కొత్త భాగస్వామ్యాలను వెదుక్కుంటోంది. ఈ క్రమంలో ట్రంప్‌ ఆలోచనలో మార్పు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ-ట్రంప్ త్వరలోనే కలుసుకోబోతున్నట్లు సమాచారం. మలేసియా వేదికగా మోదీ-ట్రంప్‌ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్ అనంతరం ఇరుదేశాధినేతలు మొదటిసారి భేటీ కాన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యలు, భారత్‌పై భారీగా సుంకాల విధింపు వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెల అక్టోబర్‌లో మలేషియాలో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య ముఖాముఖి సమావేశం జరిగే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏడాదికి రూ.20 కడితే..రూ.2 లక్షలు బెనిఫిట్

వాగులో కొట్టుకుపోతున్న యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే

పాము తల కొరికి పక్కనే పెట్టుకొని నిద్రపోయిన వ్యక్తి.. తర్వాత

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీలో పెరిగిన దసరా సెలవులు

Maharashtra: ఎట్టకేలకు చిక్కిన మ్యాన్‌ ఈటర్‌