పాము తల కొరికి పక్కనే పెట్టుకొని నిద్రపోయిన వ్యక్తి.. తర్వాత
పాములంటే సాధారణంగా అందరికీ భయమే. పాము పేరు చెబితేనే కొందరు వణికిపోతారు. ఇవన్నీ పక్కన పెడితే ఓ వక్తి పాము తనను కాటేసిందని, దాని తల కొరికి పక్కనే పెట్టుకొని నిద్రపోయాడు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో అతన్ని ఓ కట్లపాము కరిచింది. దాంతో అతనికి కోపం వచ్చి నన్నే కాటేస్తావా.. ఉండు నీ పని చెప్తాను అన్నట్టుగా.. ఆ పామును పట్టుకొని దాని తల కొరికేసాడు. అక్కడితో ఆగకుండా ఆ పామును తీసుకొచ్చి పక్కనే పెట్టుకొని నిద్రపోయాడు. ఉదయం వెంకటేష్ పక్కన చచ్చి పడి ఉన్న పామును చూసి షాకయిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్‌కు ప్రస్తుతం తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీలో పెరిగిన దసరా సెలవులు
Maharashtra: ఎట్టకేలకు చిక్కిన మ్యాన్ ఈటర్
ఉద్యోగిని ఆత్మ హత్య.. కుటుంబానికి రూ. 90 కోట్ల పరిహారం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

