ఫోన్ వద్దు.. పోదాం గ్రౌండ్‌కి అంటున్న కలెక్టర్! ఎక్కడంటే
పిల్లలు విలువైన సమయాన్ని స్మార్ట్ ఫోన్లలో వృథా చేసుకుంటోంది. ఈ అలవాటు మార్చి పిల్లలను తిరిగి క్రీడా మైదానాలకు తీసుకురావాలని సంకల్పించారు కేరళకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రేమ్ కృష్ణన్. కొత్త యువతరాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించిన ప్రేమ్ కృష్ణన్ కు ముందు నిరాశే ఎదురైంది. తొలుత ప్రతి గ్రామంలోనూ ఆయన క్రికెట్ ఆడేందుకు పిచ్ సిద్ధం చేయించారు.
తానూ స్వయంగా ఆడేవారు. ఇలా.. కండం క్రికెట్‌కు మళ్లీ ఊపిరిపోసారు పతనంతిట్ట జిల్లా కలెక్టర్ ప్రేమ్ కృష్ణన్. కొత్త యువతరాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించిన ప్రేమ్ కృష్ణన్‌కు నిరాశ ఎదురైంది. చిన్నప్పటి నుంచే పిల్లలు మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోవడం.. ఆట స్థలాలను విస్మరించడం చూసి బాల్యం ఎలా కనుమరుగువుతుందో గమనించారు. వాళ్లలో సృజనాత్మకతను పెంపొందించాలి అనుకున్నారు. “స్వాప్ యువర్ స్క్రీన్ ఫర్ ఎ స్పోర్ట్” అనే ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. “పతనం తిట్ట” జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేసి పిల్లలు స్మార్ట్ ఫోన్‌లను పక్కనపెట్టి ఆట స్థలాల్లో ఫుట్‌బాల్, క్రికెట్ ఆడేలా ప్రోత్సహిస్తున్నారు. అతను ఆదేశాలివ్వలేదు. టీ షర్ట్ ట్రాక్ పాంట్స్‌లో పిల్లలతో కలిసి నేరుగా క్రీడల్లో పాల్గొని వారికి ఆటలను అలవాటు చేశారు. ఆయన ప్రయత్నంలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా భాగస్వాములయ్యారు. దీంతో..పతనంతిట్టలో ఎక్కడ చూసినా ఆటస్థలాలు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం సామాజిక ఉద్యమంగా మారి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించి లక్ష్యాన్ని గుర్తుచేసే కార్యక్రమంగా మారింది. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి క్రీడా మైదానాల్లో ఆడుకుంటున్నారు. పిల్లలతో పేరెంట్స్ తమ బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెరుగుపడుతున్న ఓజోన్ పొర పరిస్థితి
‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ప్రీమియర్ షో.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ
రోబో శంకర్ మరణం! పట్టరాని దుఃఖంలో ధనుష్
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

