రోబో శంకర్ మరణం! పట్టరాని దుఃఖంలో ధనుష్
ధనుష్.. తమిళ్ లో స్టార్ నటుడిగా దూసుకుపోతున్నాడు ఈ హీరో.. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ధనుష్ విభిన్న పాత్రలు చేస్తూ రాణిస్తున్నాడు. ఇటీవలే కుబేర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనే కాదు.. హాలీవుడ్ లోనూ ధనుష్ నటించి మెప్పించాడు.
ఇతర హీరోల మాదిరిగా కాకుండా ధనుష్ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హీరోగానే కాదు ధనుష్ ఎన్నో సందర్భాల్లో తన గొప్పమనసును కూడా చాటుకున్నాడు. తాజాగా ధనుష్ తనతో నటించిన నటుడు రోబో శంకర్ మృతికి సంతాపం తెలిపారు. ఇంటికెళ్లి మరీ ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. ధనుష్ నటించిన మారి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు రోబో శంకర్. ఆ తర్వాత అజిత్ నటించిన విశ్వాసం, శివకార్తికేయన్ తో వేలైక్కారన్ వంటి చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటించారు. గత కొన్ని నెలలుగా ఆయన కామెర్లుతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స తీసుకుంటూనే సెప్టెంబర్ 18న మరణించారు. ఆయనకు ఇప్పుడు 46 ఏళ్లు. రోబో శంకర్ మృతి పై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ శంకర్ మృతికి సంతాపం తెలిపారు. తాజాగా ధనుష్ రోబో శంకర్ భౌతికాయానికి నివాళులు అర్పించారు. రోబో శంకర్ కూతురు లేడీ కమెడియన్ ఇంద్రజా శంకర్‌ను ధనుష్ ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మారి, మారి 2 సినిమాలో ధనుష్ తో పాటు రోబో శంకర్ నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్స్‌లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కల్కి సీక్వెల్ నుంచి దీపిక తప్పుకోవడం వెనుక ఏం జరిగింది
TOP 9 ET News: NTRకి ప్రమాదం.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
విజయ్ ఇంట్లోకి ఆగంతకుడు.. టెన్షన్‌లో పోలీసులు
Ram Charan: ఆర్చరీ బ్రాండ్ అంబాసిడర్‌గా చెర్రీ.. అక్టోబరు 2 నుంచి ఢిల్లీలో పోటీలు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

