Ram Charan: ఆర్చరీ బ్రాండ్ అంబాసిడర్‌గా చెర్రీ.. అక్టోబరు 2 నుంచి ఢిల్లీలో పోటీలు
భారత్‌లో తొలిసారి జరుగబోతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు గ్లోబల్ ఐకాన్ రామ్‌చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు జాతీయ ఆర్చరీ అసోసియేషన్ IIA అనౌన్స్ చేసింది. న్యూఢిల్లీలోని యుమున స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 12వ తేదీ వరకు ఆర్చరీ ప్రీమియర్ లీగ్ జరగనుంది. ఫ్రాంచైజీ లీగ్‌గా జరుగబోతున్న టోర్నీ.. ఆతిథ్య భారత్‌లోని పురుష, మహిళా కాంపౌండ్, రికర్వ్ ఆర్చర్లతో పాటు వివిధ దేశాల ఆర్చర్లను ఒక చోటుకు చేర్చనుంది.
దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు భారత ఒలింపిక్ మూమెంట్‌ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో లీగ్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్నొన్నారు. లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీల్లో 36 మంది భారత టాప్ ఆర్చర్లతో సహా 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీపడనున్నారు. లైట్ల వెలుతురులో గతంలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్ ఫార్మాట్ ద్వారా ఆర్చర్లు రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో పోటీపడనున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ఆర్చరీ… క్రమశిక్షణ, ఏకాగ్రత వంటి అనేక అంశాల సమ్మేళనం. అందుకే దీనితో అనుబంధం ఏర్పడింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌తో ప్రయాణించటం గర్వంగా ఉంది. భారత ఆర్చర్లకు ఇది అంతర్జాతీయ గుర్తింపు తేనుంది. భవిష్యత్ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలవనుంది’ అని పేర్కొన్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Deepika Padukone: ‘కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!’
ఏటా శివ మాల వేసుకుంటా.. పీరియడ్స్ రాకుండా ఆ పని చేస్తా…
Little Hearts: లిటిల్ హార్ట్స్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో..
థార్ కారులో ఫుడ్ డెలివరీ.. షాకైన కస్టమర్
వీధి కుక్కలపై వింత నిర్ణయం రెండు సార్లు కరిస్తే.. జీవిత ఖైదే
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

