సిరియా పై ఇజ్రాయెల్‌ కమాండోల ఆపరేషన్‌

| Edited By: Phani CH

Jan 04, 2025 | 8:59 PM

సిరియాలోని ఓ భూగర్భ ఆయుధ తయారీ స్థావరంపై ఇజ్రాయెల్‌ కమాండోలు మెరుపుదాడి చేశారు. కేవలం మూడు గంటల్లోనే అటాక్ ఎపిసోడ్ ను పూర్తి చేశారు. అక్కడి పేలుడు పదార్థాలను ధ్వంసం చేస్తే.. ఏకంగా మినీ భూకంపమే వచ్చింది. తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన ఐడీఎఫ్‌ అందులోని కీలక ఘట్టాల వీడియోను పోస్టు చేసి దాడిని కళ్లకు కట్టినట్లు చూపింది. దీనికి పెట్టిన కోడ్‌నేమ్‌ ‘ఆపరేషన్‌ మెనీవేస్‌’..! 120 మంది మెరికల్లాంటి కమాండోలు ఇందులో పాల్గొన్నారు.

2017కు ముందు దక్షిణ సిరియాలో ఓ ఆయుధ కర్మాగారం ఉండేది. ఇది ఇరాన్‌ కనుసన్నల్లో నడిచేది. 2017లో ఇజ్రాయెల్‌ వాయుసేన దాడి చేసి దాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఆయుధ కర్మాగారాన్ని మస్యాఫ్‌ ప్రాంతంలోకి తరలించాలని ఇరాన్‌ నిర్ణయించింది. ఇక్కడ కొండల్లో దాదాపు 70 నుంచి 130 మీటర్ల మేరకు భూమిని తవ్వి 2021లో ఇందులో క్షిపణుల ఉత్పత్తి మొదలుపెట్టింది. గుర్రపునాడా ఆకారంలో మూడు ప్రవేశద్వారాలతో దీనిని నిర్మించారు. ఒకవైపు ముడి పదార్థాలు, రెండో దానివైపు పూర్తయిన క్షిపణులు, మూడోదాని వైపు లాజిస్టిక్స్ ఆఫీసులు ఉన్నాయి. మొత్తం 16 గదుల్లో తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో రాకెట్‌ ఫ్యూయల్‌ మిక్సర్లు, మిసైల్‌ బాడీ తయారీ యూనిట్లు, పెయింట్‌ రూమ్‌ వంటివి ఏర్పాటుచేశారు. ఈ ఫెసిలిటీలో 300 కిలోమీటర్ల రేంజిలో దాడి చేసే 100 నుంచి 300 క్షిపణులను ఏటా తయారు చేయగల సామర్థ్యం దీనికి ఉంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..

చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!

ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!

సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌

తప్పతాగడం ఎందుకు ?? ఇలా రోడ్లపై సోలడం ఎందుకు ??