Green Card: గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్.! కార్డ్ వ్యాలిడిటీని పొడిగింపు.
అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్‌కార్డుదారులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ పర్మినెంట్ రెసిడెంట్ కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించింది. గతంలో గ్రీన్‌కార్డు గడువు తీరినప్పటికీ.. మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీ పొడిగించేవారు. ఇప్పుడు దీన్ని 36 నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ వెల్లడించింది. దీంతో గ్రీన్‌కార్డు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఊరట లభించినట్లైంది.

సాధారణంగా అమెరికా లో గ్రీన్‌కార్డులు పొందినవారు ప్రతీ పదేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి. ఇందుకోసం కార్డు గడువు తీరిపోయే కాలానికి ఆరు నెలల ముందే ఐ-90 ఫామ్‌ను సమర్పించాలి. రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి కార్డు వ్యాలిడిటీని 24 నెలలు పొడిగిస్తూ రిసీట్ నోటీసు ఇస్తారు. దీంతో గ్రీన్‌కార్డు గడువు తీరిపోయినా.. ఈ నోటీసుతో వారికి చట్టబద్ధమైన నివాస హోదా కొనసాగుతుంది. కొత్త కార్డు జారీ అయ్యే వరకు ఉద్యోగాలు, ప్రయాణాల సమయంలో వారు దాన్ని లీగల్ స్టేటస్ ప్రూఫ్‌గా వినియోగించుకోవచ్చు. తాజాగా ఈ గ్రీన్‌కార్డు అదనపు వ్యాలిడిటీని 36 నెలలకు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త కార్డుల కోసం వేచిచూసే వారు మరింతకాలం చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదాను కొనసాగించేందుకు వీలు కలుగుతుంది. అయితే, కండిషనల్ రెసిడెన్సీ తీసుకునేవారి గ్రీన్‌కార్డుల గడువు రెండేళ్లపాటే ఉంటుంది. వీరికి తాజా పొడిగింపు వర్తించదు. వీరు ముందుగా నివాస హోదాపై ఉన్న కండీషన్స్ తొలగించుకునేందుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కార్డు గడువు తీరే 90 రోజుల్లోపు దీన్ని చేసుకోవాలి. దరఖాస్తు అనుమతి పొందితే.. వారికి 10ఏళ్ల కాలానికి గ్రీన్‌కార్డు లభిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.