Hell gates: అక్కడ 15 రోజుల పాటు తెరుచుకునే నరక ద్వారాలు.. దెయ్యాలకు నచ్చిన ఆహారం అందించే సంప్రదాయం..

|

Oct 18, 2022 | 9:58 AM

దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని పక్కన పెడితే.. దెయ్యాలకు ఆహారం తినిపించే ఓ దేశం ఉందని మీకు తెలుసా.. అవును ఇది నిజం. అక్కడ 15 రోజుల పాటు దెయ్యాలకు ఆహారం అందిస్తారు.


మీడియా కథనాల ప్రకారం ఆసియా దేశమైన కంబోడియాలో, ప్రతి సంవత్సరం సెప్టెంబరు, అక్టోబర్ మధ్య ఈ పండుగను 15 రోజుల పాటు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా 15 రోజుల పాటు నరకం తలుపులు తెరుస్తారని ఆ ప్రాంతవాసుల నమ్మకం. ఈ ద్వారాలు తెరిచాక దుష్ట ఆత్మలు, దయ్యాలు బయటకు వస్తాయని, అవి ఆకలితో ఉంటాయని చెబుతారు. వాటిని శాంతింపజేసేందుకు వాటికి ఆహారం అందజేస్తారు. ఈ పండుగలో నాలుగు రకాల దయ్యాలు, ఆత్మలు తిరుగాడుతుంటాయని చెబుతారు. ఈ ఉత్సవాన్ని ఖైమర్ పండుగ అని పిలుస్తారు. ఈ పండుగ రోజుల్లో దెయ్యాలు దేవాలయాలు, వారి బంధువుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ మంచి ఆహారం కోసం ఎదురు చూస్తాయని, వాటికి మంచి ఆహారం లభించకపోతే మనుషులను ఇబ్బంది పెడతాయని స్థానిక ప్రజల గాఢ నమ్మకం. ఈ క్రమంలో వారు తమ ఏడు తరాల పూర్వీకులకు ఆహారం అందజేస్తారు. పండుగ మొదటి రోజు సూర్యోదయానికి ముందే ఆహారాన్ని సిద్ధం చేస్తారు. దెయ్యాలు కాంతిని ఇష్టపడవనే భావనతో ఉదయాన్నే వాటికి ఆహారాన్ని అందిస్తారు. చిన్నపాటి సూర్యకాంతి కనిపించినా అవి ఆహారం తీసుకోడానికి ఇష్టపడవని చెబుతారు. దెయ్యాలకు ఆహారం పెట్టనివారు నరకానికి వెళతారని స్థానికులు భావిస్తారు. నరకంలోవారికి దుస్తులు, ఆహారం లభించవని చెబుతారు. ఉత్సవ సమయంలో బంధువుల ఆత్మలకు ఆహారం అందజేస్తే బాధలు తగ్గుతాయని స్థానికులు విశ్వసిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.