ఈ విషం ప్రాణం తియ్యదు.. కానీ ధర తెలిస్తే ప్రాణం పోతుంది !!
విషం అంటేనే ప్రాణాలు తీసేస్తుంది. పాములు, తేళ్లు, సాలీళ్లు ఇలా ఎన్నో రకాల జీవుల్లో విషం ఉంటుంది. కానీ అదే విషం కొన్నిసార్లు ప్రాణాలు కాపాడే ఔషధం కూడా అవుతుంది.
విషం అంటేనే ప్రాణాలు తీసేస్తుంది. పాములు, తేళ్లు, సాలీళ్లు ఇలా ఎన్నో రకాల జీవుల్లో విషం ఉంటుంది. కానీ అదే విషం కొన్నిసార్లు ప్రాణాలు కాపాడే ఔషధం కూడా అవుతుంది. అలాంటిదే ‘డెత్‌స్టాకర్’ తేలు విషం. అత్యంత ప్రమాదకరమైన ఈ విషం ద్రవ పదార్థాల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది కూడా. భూమ్మీద ఉన్న తేళ్లన్నింటిలోనూ ‘డెత్‌స్టాకర్’ తేళ్లు అత్యంత విషపూరితమైనవి. ఎక్కువగా ఉత్తర ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఈ తేళ్లు రెండు నుంచి ఆరేళ్ల పాటు బతుకుతాయి. పది సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. వీటి విషంలో ‘క్లోరోట్యాక్సిన్’గా పిలిచే అత్యంత అరుదైన రసాయన పదార్థంతోపాటు మరికొన్ని ముఖ్యమైన న్యూరోట్యాక్సిన్లు ఉంటాయి. ఈ క్లోరోట్యాక్సిన్ మెదడులోని కేన్సర్ కణితులు మరింతగా విస్తరించకుండా అడ్డుకుంటుంది. అంతేగాకుండా మెదడులో కేన్సర్ సోకిన కణాలకు మాత్రమే అతుక్కుపోతుంది. దీనివల్ల వైద్యులు సర్జరీ చేసి కేన్సర్ సోకిన భాగాన్ని పూర్తిగా తొలగించడానికి వీలవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు.. దెబ్బకు ఎయిర్‌పోర్ట్ క్లోజ్ !!
ఏనుగుకు ఆహారం పెట్టాడని రూ. 75 వేల జరిమానా వేశారు !!
Victory Venkatesh: మనవరాలితో.. వెంకీ తాత ముచ్చటైన వీడియో !!
బ్రో… NTRకు నచ్చని స్టోరీ చెర్రీకి ఎలా కలిసొస్తుంది !!
కూతుళ్ల కోసం ఆస్తులు అమ్మి మరీ.. ఎమోషనల్ అయిన జీవిత..