ఉద్యోగులకు కొరియా కంపెనీ బంపరాఫర్.. ఆ పనిచేసేందుకు ఆర్ధిక ప్రోత్సాహం

|

Feb 14, 2024 | 7:45 PM

ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గిపోతోంది. మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జననాల రేటు తగ్గిపోతుండటంతో ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పిల్లలను కనడానికి ప్రోత్సహకాలను అందజేయడానికి ముందుకొచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గిపోతోంది. మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జననాల రేటు తగ్గిపోతుండటంతో ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పిల్లలను కనడానికి ప్రోత్సహకాలను అందజేయడానికి ముందుకొచ్చాయి. ఈ క్రమంలో తమ దేశంలో దారుణంగా పడిపోయిన జననాల రేటును పెంచడానికి దక్షిణ కొరియాకు చెందిన ఓ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో ఉద్యోగులు పిల్లలను కనాలని, అలా చేస్తే ఆర్ధిక ప్రోత్సాహం అందజేస్తామని ప్రకటించింది. పిల్లలను కన్న ప్రతిసారీ 100 మిలియన్ కొరియన్ వోన్‌లు అంటే మన కరెన్సీలో ఈ మొత్తం దాదాపు 63 లక్షలు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ బూయోంగ్ గ్రూప్ 2021 లో ఈ పథకం చేపట్టింది. దీంతో గత మూడేళ్లలో 70 మంది పిల్లలను కన్న తమ ఉద్యోగులకు 7 బిలియన్ కొరియన్ వోన్లు అందజేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Amazon Prime: ప్రైమ్ యూజర్లకు భారీ షాక్.. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఓటీటీలు

సభలో ఒక్కసారి కూడా నోరు విప్ప‌ని నటులు

95 ఏళ్ల బామ్మ.. కారు డ్రైవింగ్‌.. యసు నెంబర్ మాత్రమే అంటున్న వృద్ధ మహిళ

ఆమెకు ఐన్‌స్టీన్‌ను మించిన తెలివున్నా.. తీరని ఆవేద

Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు పిచ్చపిచ్చగా నచ్చిన వెబ్ సైట్ ఇదే