ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు బంద్‌.. పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు బంద్‌.. పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

Phani CH

|

Updated on: Aug 05, 2024 | 9:22 PM

ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధం మధ్యలో హెజ్‌బొల్లా, ఇరాన్‌ జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దాంతో ఎయిర్‌ ఇండియా ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌ భూభాగం దిశగా లెబనాన్‌ పలు రాకెట్లను ప్రయోగించింది. హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియా గత మంగళవారం ఇరాన్‌లో హత్యకు గురయ్యారు.

ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధం మధ్యలో హెజ్‌బొల్లా, ఇరాన్‌ జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దాంతో ఎయిర్‌ ఇండియా ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌ భూభాగం దిశగా లెబనాన్‌ పలు రాకెట్లను ప్రయోగించింది. హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియా గత మంగళవారం ఇరాన్‌లో హత్యకు గురయ్యారు. మరోవైపు హమాస్‌ సైనిక విభాగాధిపతి మహమ్మద్‌ డెయిఫ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇక, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సీనియర్‌ మిలిటరీ కమాండర్‌ ఫాద్‌ షుక్ర్‌ ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో మృతిచెందాడు. ఈ వరుస పరిణమాలతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ రోజు నుంచి ఆగస్టు 8వ తేదీ వరకూ టెల్‌అవీవ్‌ నుంచి వచ్చే.. అక్కడకు వెళ్లే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఆగస్టు 8వ తేదీ వరకు ఢిల్లీ-టెల్‌ అవీవ్‌ మధ్య ప్రయాణాల కోసం ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు మినహాయింపులు ప్రకటించింది. టికెట్ల రద్దు, రీషెడ్యూలింగ్‌పై ఒకసారి ఛార్జీల మినహాయింపు ఇస్తామని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫాస్టగ్ కొత్త రూల్స్.. ఇంతకీ .. కేవైసీ అప్‌డేట్ చేశారా ??

Ismart News: కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు