పిల్లలు చనిపోతుంటే ఫోటో షూట్‌ చేస్తారా.. జెలెన్‌స్కీ మీద మస్క్‌ మండిపాటు

Updated on: Feb 27, 2025 | 7:57 PM

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం సమయంలో జెలెన్‌స్కీ తన భార్యతో కలిసి వోగ్‌ ఫోటో షూట్‌లో పాల్గొనడంపై మస్క్‌ మండిపడ్డారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే అవేవీ పట్టనట్టు భార్యతో ఫోటో షూట్‌లో పాల్గొనడమేంటి..? అంటూ ప్రశ్నించారు.

గత మూడేళ్లుగా రష్యా – ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాకా.. రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా వేదికగా రష్యా-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ శాంతి చర్చల వేళ.. గతంలో జెలెన్‌స్కీ ఫోటో షూట్‌లో పాల్గొన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఎలాన్‌ మస్క్‌ తీవ్ర స్థాయిలో రియాక్ట్‌ అయ్యారు. రష్యాతో యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే భార్యతో కలిసి ఫోటో షూట్ చేస్తారా..? అంటూ మండిపడ్డారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఇవేం పనులు అంటూ జెలెన్‌స్కీపై విరుచుకుపడ్డారు. ఈ ఫోటో షూట్‌పై గతంలో అమెరికా రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు మానవతా దృక్పథంతో తాము సాయం చేస్తుంటే.. జెలెన్‌స్కీ మాత్రం తమను పిచ్చోళ్లను చేస్తున్నాడంటూ విమర్శించారు. ఇప్పుడు శాంతి చర్చల వేళఫోటోషూట్‌ అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాఠశాలకు వెళ్తూ గుండె*పోటుతో కుప్పకూలిన విద్యార్థిని

ప్రియురాలితో ఉండగా భర్తను.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

పురుషులకు శుభవార్త! మహిళల ఉచిత బస్సు ఇబ్బంది ఇక తప్పినట్లే..!

మహిళలకు గుడ్‌న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ. 2500