AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మార్వో ఆఫీసు గుమ్మానికి మంగళసూతం కట్టి మహిళ వినూత్న నిరసన..!వైరల్ అవుతున్న వీడియో..:Rajanna Sircilla video.

Anil kumar poka
|

Updated on: Jul 02, 2021 | 5:04 PM

Share

Woman protest against Rudrangi Tahsildar : తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని ఓ మహిళ నిరసనకు దిగింది. తన భూమి పట్టా కోసం.. మంగళసూత్రాన్ని.. తహసీల్దార్ ఆఫీసుకు కట్టింది ఆ మహిళ. తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగి.. తిరిగి విసిగి వేశారిపోయి చివరకు ఈ నిర్ణయం తీసుకుంది.

తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని ఓ మహిళ నిరసనకు దిగింది. తన భూమి పట్టా కోసం.. మంగళసూత్రాన్ని.. తహసీల్దార్ ఆఫీసుకు కట్టింది ఆ మహిళ. తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగి.. తిరిగి విసిగి వేశారిపోయి చివరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ని సార్లు అధికారులను బ్రతిమాలినా పట్టించుకోలేదని, పట్టా కోసం యేళ్ల తరబడి తిరుగుతునే ఉన్నా ఫలితం లేకపోవడంతో చివరికి ఆమె, తన మాంగళ్యాన్ని ఆఫీసు గుమ్మానికి వ్రేలాడగట్టింది.వివరాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన దంపతులు పొలాస రాజేశం, మంగ. వీరికి సర్వే నెంబర్ 130/14లో 2 ఎకరాల భూమి ఉంది. అయితే, మంగ భర్త రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోగానే వేరే వాళ్ళకి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆ భూమిని పట్టా చేశారు. అయితే, తన భూమిని అన్యాయంగా వేరే వాళ్లకి పట్టా చేశారని.. తన భూమిని తనకు పట్టా చేయాలని మూడు సంవత్సరాలుగా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతునే ఉంది మంగ. అయినా అధికారుల్లో చలనం లేకపోయింది.

మరిన్ని ఇక్కడ చూడండి: సినీ ఫక్కీలో క్రిమినల్ అరెస్ట్..!గ్యాంగ్‌స్టర్‌‌‌ను చుట్టుముట్టిన క్రైం బ్రాంచ్ పోలీసులు..ట్రెండ్ అవుతున్న వీడియో:police video.

నీటి మంటలు సాగర్‌లో టెన్షన్‌.. రోజు రోజుకు ముదురుతున్న జలవివాదం..రంగంలోకి దిగిన పోలీసులు..:controversy on water projects video.

జనసంచారంలో మొసలి విహారయాత్ర..! వీధుల్లో మొసలి తీరుగుతున్న షాకింగ్ వీడియో వైరల్:crocodile romeing on roads video.