బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూనే.. టెన్త్‌లో టాప్ స్కోర్ వీడియో
ఆ అమ్మాయి పదో తరగతి చదువుతున్న సమయంలో అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి వెళ్తే రకరకాల టెస్ట్ లు చేశారు. తర్వాత గుండె పగిలే వార్త చెప్పారు. ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ సోకిందని వైద్యులు చెప్పడంతో గుండె ఆగినంత పనైంది. అయితే ఆ అమ్మాయి మాత్రం తన కల నేరవేరకుండా తన ప్రాణాలు తీసే హక్కు ఆ దేవుడికి కూడా లేదని గట్టిగా నమ్మింది. చిరవకు అదే నిజమైంది.. దేవుడు ఓడాడు.. ఆమె గెలిచింది. కలలు అందరూ కంటారు. అయితే కొందరే వాటి సాకారం కోసం తపిస్తారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సీరియస్‌గా ప్రిపరేషన్ సాగిస్తున్న సమయంలో గతేడాది అనుకోని పిడుగులాంటి వార్త బాలికకు తెలిసింది.
చికిత్స తీసుకుంటూ ఎగ్జామ్ రాయలేదు. అయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ప్రాణాలు హరించే మహమ్మారిని ఏ మాత్రం లెక్క చేయక 2025లో బోర్డు పరీక్షల్లో టాప్ స్కోర్ సాధించి రాష్ట్ర టాపర్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇషికా బాలా ఛత్తీస్‌గఢ్ బోర్డు పరీక్షలో ఏకంగా 99.17 శాతం మార్కులు సాధించింది. గట్టి సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని ఇషికా నిరూపించింది. నక్సల్స్ ప్రభావిత కాంకేర్ జిల్లాలోని గుండహూర్ గ్రామం ఇషికాది. అక్కడి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థిని ఆమె. నేపథ్యం సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి రైతు. నవంబర్ 2023లో ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. రాయ్‌పూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. ఆ తర్వాత నవ రాయ్‌పూర్‌లోని బాల్కో మెడికల్ సెంటర్‌లో చికిత్స తీసుకుంది. దీని కారణంగానే ఆమె 2024 లో బోర్డ్ ఎగ్జామ్ మిస్ అయింది. చికిత్స తర్వాత కోలుకున్న ఇషికకు ఆత్మస్థైర్యం తోడైంది. మరో 2-3 ఏళ్లపాటు రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. IAS అధికారి కావాలనేది తన కల అని ఇషిక చెబుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
భార్య ముక్కు కొరికేసిన భర్త.. అందంగా ఉందని కాదు వీడియో
చీర కట్టినా..చివరికి దొరికిపోయాడు వీడియో
రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి..దానిపైనే కునుకేసిన వ్యక్తి ! ఎక్కడంటే వీడియో

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
