Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటికి పిలిచి ప్రాణం తీసిన ప్రియురాలు వీడియో

ఇంటికి పిలిచి ప్రాణం తీసిన ప్రియురాలు వీడియో

Samatha J
|

Updated on: Jun 26, 2025 | 3:36 PM

Share

వివాహేతర సంబంధాలు ప్రాణాల మీదకు తీసుకొస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. ప్రియురాలు, ప్రియుడి మోజులో జీవిత భాగస్వామిని అడ్డుతొలగించుకుంటున్న వారు కొందరు కాగా, తన ప్రేమను అంగీకరించలేదని ప్రేయసి లేదా ప్రియుడి ప్రాణాలనే బలిగొంటున్న ఘటనలూ జరగుతున్నాయి. తాజాగా, నల్లగొండ జిల్లాలో ఓ మహిళ, తన ప్రియుడిని పథకం ప్రకారం ఇంటికి పిలిచి, అంతమొందించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం నోముల గ్రామానికి చెందిన జానయ్య అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వివాహితతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై, సదరు మహిళ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు కూడా పలుమార్లు పంచాయితీ పెట్టి, ఆ యువకుడిని మందలించటం జరిగింది.

అయితే, జానయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో, అతడి బలహీనతను ఆసరాగా చేసుకొని సదరు మహిళ.. తనకు పెద్ద మొత్తంలో డబ్బు, ఇంటి స్థలం ఇవ్వాలని కోరింది. దీనికి జానయ్య నిరాకరించటంతో, అతడిని అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఈ మేరకు అతడికి ఫోన్ చేసి, తన ఇంటికి పిలిచింది. ఎప్పటిలాగే వచ్చిన జానయ్య ఆమె ఇంటిలోకి వెళ్లగానే, అప్పటికే లోపల మాటు వేసిన ఆ మహిళ భర్త, ఇతర కుటుంబ సభ్యులు కలిసి జానయ్య మీద దాడి చేశారు. అయితే, ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న జానయ్య పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే, వారంతా కలిసి అతడిన పట్టుకుని, చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్రంగా గాయపడిన జానయ్యను నలగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా,చికిత్స పొందుతూ జానయ్య మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పథకం ప్రకారమే జానయ్య మీద దాడి చేసి హత్య చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

భార్య ముక్కు కొరికేసిన భర్త.. అందంగా ఉందని కాదు వీడియో

చీర కట్టినా..చివరికి దొరికిపోయాడు వీడియో

రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి..దానిపైనే కునుకేసిన వ్యక్తి ! ఎక్కడంటే వీడియో