గాల్లోనే పోయిన 8 మంది ప్రాణాలు.. అసలు వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
బ్రెజిల్ దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ హాట్ ఎయిర్ బెలూన్ గాలిలో ఉండగానే మంటల్లో చిక్కుకుని కూలిపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 8 మంది మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన దక్షిణ బ్రెజిల్‌లోని శాంటా కాటరినా రాష్ట్రంలో జరిగింది. శాంటా కాటరినా రాష్ట్రంలోని ప్రయా గ్రాండే నగరంలో శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన సంభవించింది. మొత్తం 21 మంది ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఈ టూరిజం బెలూన్‌లో మార్గమధ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
మంటలు అంటుకున్న కొద్దిసేపటికే బెలూన్ నియంత్రణ కోల్పోయి వేగంగా భూమిపై కూలిపోయిందని వారు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన 13 మందిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ పేర్కొంది.స్థానిక, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పర్యాటక విహారయాత్రలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని వీడియోల కోసం :
భార్య ముక్కు కొరికేసిన భర్త.. అందంగా ఉందని కాదు వీడియో
చీర కట్టినా..చివరికి దొరికిపోయాడు వీడియో
రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి..దానిపైనే కునుకేసిన వ్యక్తి ! ఎక్కడంటే వీడియో

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
