Gudivada: కారుపై Govt Vehicle అని రాసి ఉంది – కానీ అందులో నుంచి దిగిన పర్సన్‌ని చూస్తే షాక్
సినీ నటి అనన్య నాగళ్ల గుడివాడలో సందడి చేశారు. పెయింట్స్ బ్రాండ్ ప్రచారంలో పాల్గొన్న అనన్య, ప్రభుత్వ వాహనంలో వచ్చినట్టు భావన కలగడంతో విమర్శలు రావడం ఆసక్తికరంగా మారింది. వాహన వివాదం ఆమె పర్యటనను హాట్ టాపిక్‌గా మార్చింది. ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..
కృష్ణా జిల్లా గుడివాడలో సినీ నటి అనన్య నాగళ్ల సందడి చేశారు. గుడివాడ పట్టణంలో ఓ పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా అనన్యను ఎంపిక చేసుకున్నారు సదరు వ్యాపారులు. దీంతో ఆమె పలు పెయింట్ షాప్‌లకు వెళ్లారు. అనన్యకు ఘనస్వాగతం పలికి.. ఆమెతో ఫొటోలు దిగడానికి ఎగబడ్డారు జనం. అయితే.. అనన్య నాగళ్ల ప్రభుత్వ వాహనం అని రాసి ఉన్న వాహనంలో గుడివాడ వెళ్లడంపై వివాదం నెలకొంది. సినీ నటి ప్రభుత్వ వాహనంలో వెళ్లడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. అసలది ప్రభుత్వ వాహనమా లేక ఇంకెవరైనా ప్రైవేట్ వ్యక్తులు GOVT వెహికిల్ అని రాసుకున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. తమకేం తెలియని.. అనన్యను ఆహ్వానించిన వారే ఈ వాహనం ఏర్పాటు చేశారని.. ఆమె మేనేజర్ చెబుతున్నారు. మొత్తానికి అనన్య పర్యటన గుడివాడలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

