అసలే చలికాలం.. ఆపై జ్వరాలు.. మరి జాగ్రత్తలేంటి ??

|

Dec 07, 2024 | 12:04 PM

శీతాకాలం ప్రారంభంలోనే చలి పంజా విసురుతోంది. ఓవైపు వర్షాలు, మరోవైపు పొగమంచుతో దేశంలోని పలు ప్రాంతాల్లో విచిత్రమైన వాతావరణ నెలకొంటుంది. ఈ క్రమంలో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, వింటర్‌లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు వైద్యులు చెబుతున్నారు.

చలికాలంలో ఉదయం వేళ చలి తీవ్రతతో పాటు మంచుకూడా కురుస్తుందని, ఈ సమయంలో సాధ్యమైనంతవరకూ వృద్ధులు, ఆస్తమా పేషంట్లు బయటకు వెళ్లకపోవడమే మంచిదంటున్నారు. ఉదయం వాకింగ్‌ వెళ్లేవారు, వివిధ వ్యాయామాలు చేసేవారు ఓవర్‌ ఎగ్జైట్‌ కావద్దని సూచిస్తున్నారు. అధిక వర్కవుట్స్‌ వల్ల గుండెపై భారం పడుతుందని, అది హార్ట్‌ఎటాక్‌కు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బేకరీ ఫుడ్‌, ఫ్రిజ్‌లో స్టోర్‌ చేసిన ఆహారం, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవాలని, తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు. వింటర్‌లో తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో ఎక్కువగా ఊపిరి తిత్తుల సబంధిత సమస్యలు, డయేరియా లాంటి సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉందని కనుక జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

PV Sindhu: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న పీవీ సింధు

సముద్రపు ఒడ్డున యోగా చేస్తున్న నటి… అంతలోనే

TOP 9 ET News: బాలీవుడ్‌లో బన్నీ హిస్టరీ.. కలెక్షన్స్‌లో షారుఖ్‌ను దాటి నెంబర్ 1

రూ.294 కోట్ల దిమ్మతిరిగే కలెక్షన్స్.. మొత్తానికి లెక్క తేల్చిన పుష్పరాజ్‌.. AAల్ టైం రికార్డ్ !!

ఎట్టకేలకు స్టార్ హీరో నుంచి జానికి పిలుపు.. మళ్లీ పట్టాలెక్కినట్టే !!