Men Health: స్పెర్మ్ కౌంట్ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పునరుత్పత్తి ఆరోగ్యం విషయంలో ఎక్కువగా మహిళల గురించే చర్చిస్తారు కానీ, సంతానోత్పత్తి విషయంలో పురుషుల పాత్ర చాలా కీలకమైనది. అందుకే పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేసి, స్మెర్మ్ కౌంట్‌ను పెంచే కొన్ని ఆహార పదార్థాలను నిపుణులు సూచిస్తున్నారు.
సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పునరుత్పత్తి ఆరోగ్యం విషయంలో ఎక్కువగా మహిళల గురించే చర్చిస్తారు కానీ, సంతానోత్పత్తి విషయంలో పురుషుల పాత్ర చాలా కీలకమైనది. అందుకే పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేసి, స్మెర్మ్ కౌంట్‌ను పెంచే కొన్ని ఆహార పదార్థాలను నిపుణులు సూచిస్తున్నారు. వాల్ నట్స్ లో పుష్కలంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫోలేట్ వీర్యకణాల వృద్ధికి తోడ్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. బాదం పప్పులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు జింక్, సెలీనియం, విటమిన్-ఇ తదితర పోషకాలు ఉంటాయని చెప్పారు. రోజువారీ ఆహారంలో బాదం పప్పులకు చోటిస్తే స్పెర్మ్ కౌంట్ దెబ్బతినకుండా కాపాడతాయని తెలిపారు. బ్రెజిల్ నట్స్ తో వీర్య కణాల వృద్ధితో పాటు ఆరోగ్యం చేకూరుతుందని వివరించారు.
ఇందులోని సెలీనియం స్పెర్మ్ నాణ్యతను పెంచుతుందని తెలిపారు. వంటింట్లో తప్పకుండా కనిపించే టమాటాలతోనూ వీర్య కణాల నాణ్యత పెంచుకోవచ్చని చెప్పారు. వీటిలో లైకోపీన్ ఉంటుందట. రోజూ రెండు, మూడు టేబుల్ స్పూన్ల టమాటా గుజ్జును తీసుకుంటే స్పెర్మ్ నాణ్యత పెరుగుతుందని వివరించారు. మాంసాహారులైతే సీ ఫుడ్స్ తరచుగా తీసుకోవడం ద్వారా వీర్య పుష్టి పెరుగుతుందట. సముద్రపు చేపలు, రొయ్యలు వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు ఇతరత్రా పోషక పదార్థాలు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

