Zomato CEO: 4.50 కోట్ల స్పోర్ట్స్‌ కారు కొన్న జొమాటో సీఈఓ.. దేశంలోకి తొలిసారి ఎంట్రీ!

|

Mar 17, 2024 | 2:59 PM

లగ్జరీ కార్లకు ఉండే క్రేజే వేరు. వీటిని కొనుగోలు చేయడానికి సంపన్నులు పోటీ పడుతుంటారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి మరీ ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటారు. అలాంటి ఓ లగ్జరీ కారు తాజాగా మన దేశ రోడ్లపైకి వచ్చింది. భారత్‌లో మొట్టమొదటి ఆస్టన్ మార్టిన్ DB12 స్పోర్ట్స్‌ కారు ఇదేనట. దీని ధర కూడా నాలుగున్నర కోట్ల రూపాయల పైమాటే. అలాగని ఈ కారును కొన్నది ఏ అంబానీనో, అదానీనో కాదు.. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌.

లగ్జరీ కార్లకు ఉండే క్రేజే వేరు. వీటిని కొనుగోలు చేయడానికి సంపన్నులు పోటీ పడుతుంటారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి మరీ ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటారు. అలాంటి ఓ లగ్జరీ కారు తాజాగా మన దేశ రోడ్లపైకి వచ్చింది. భారత్‌లో మొట్టమొదటి ఆస్టన్ మార్టిన్ DB12 స్పోర్ట్స్‌ కారు ఇదేనట. దీని ధర కూడా నాలుగున్నర కోట్ల రూపాయల పైమాటే. అలాగని ఈ కారును కొన్నది ఏ అంబానీనో, అదానీనో కాదు.. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అవకాశాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేయాలన్న ఆలోచనలో దీపిందర్‌ గోయల్‌ ఇటీవల న్యూఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో 5 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.79 కోట్ల రూపాయలు. వేర్వేరు యజమానుల నుంచి కొనుగోలు చేసిన ఆ భూమికి మొత్తం స్టాంప్‌ డ్యూటీనే 5.24 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సీఆర్‌ఈమ్యాటిక్స్‌ అనే ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ బహిర్గతం చేసింది.

బ్రిటిష్‌ సూపర్‌ కార్‌ తయారీ సంస్థ ఆస్టన్‌ మార్టిన్‌ గతేడాది సెప్టెంబరులోనే DB12 కారును లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.4.59 కోట్లు. దీపిందర్‌ గోయల్‌ ఈ లగ్జరీ కారును తాజాగా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on