Viral Cat: మహానగరాన్ని వణికించిన పిల్లి.! పిల్లిని వెదికేందుకు ప్రత్యేక పెట్రోలింగ్‌.

Viral Cat: మహానగరాన్ని వణికించిన పిల్లి.! పిల్లిని వెదికేందుకు ప్రత్యేక పెట్రోలింగ్‌.

Anil kumar poka

|

Updated on: Mar 17, 2024 | 2:52 PM

ఓ పిల్లి కారణంగా మహానగరం వణికిపోతోంది. ఎప్పుడు.. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణం.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడ్డాక అక్కడి నుంచి కనిపించకుండా పోవడమే. దీంతో ఆ పిల్లి క్యాన్సర్‌ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందనే భయం ఆ నగరంలో నెలకొంది. జపాన్‌ హిరోషిమాలోని ఫుకుయామా అధికారులు ఆ పిల్లిని వెదికేందుకు పెట్రోలింగ్‌ను మరింతగా పెంచారు.

ఓ పిల్లి కారణంగా మహానగరం వణికిపోతోంది. ఎప్పుడు.. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణం.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడ్డాక అక్కడి నుంచి కనిపించకుండా పోవడమే. దీంతో ఆ పిల్లి క్యాన్సర్‌ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందనే భయం ఆ నగరంలో నెలకొంది. జపాన్‌ హిరోషిమాలోని ఫుకుయామా అధికారులు ఆ పిల్లిని వెదికేందుకు పెట్రోలింగ్‌ను మరింతగా పెంచారు. ఆ పిల్లి ఎక్కడ కనిపించినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు. కాగా ఆ పిల్లి చివరిగా రసాయన కర్మాగారం నుండి బయటపడినట్లు భద్రతా ఫుటేజీలో కనిపించింది. ఒక కార్మికుడు ఆ పిల్లి పంజా గుర్తులను గమనించి, దానిని ఉన్నతాధికారులకు తెలిపాడు. ఆ పిల్లికి అంటుకున్న రసాయనం అత్యంత ప్రమాదకరం. దానిని ముట్టుకున్నా లేదా పీల్చినా వెంటనే శరీరంపై దద్దుర్లు, వాపు వచ్చి, తీవ్ర వ్యాధికి దారితీస్తుంది. ఆ పిల్లి కోసం వెదకగా, ఇంకా దాని జాడ తెలియలేదన్నారు. అది సజీవంగా ఉందా లేదా అనేది కూడా అనుమానంగా ఉందని ఫుకుయామా సిటీ హాల్‌లోని ఒక అధికారి తెలిపారు. ఫ్యాక్టరీలో రసాయన వ్యాట్‌ను కప్పి ఉంచే షీట్ కొంతభాగం చిరిగిపోయిందని ఫ్యాక్టరీ మేనేజర్ అకిహిరో కొబయాషి తెలిపారు. దానిలో పిల్లి పడి, తరువాత ఎటో వెళ్లిపోయిందని, దానికోసం తమ సిబ్బంది వెదుకుతున్నారని చెప్పారు. సాధారణంగా పిల్లులు తమ బొచ్చును నాకుతుంటాయని, ఈ విధంగా చూస్తే ఆ పిల్లి ఇప్పటికే ఆ రసాయన్నాన్ని నాకి, చనిపోయివుంటుందని స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన లిండా షెంక్ అనే నిపుణురాలు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..