కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే.. పడగవిప్పిన 3 నాగులతో పరాచకాలు.. ఇచ్చిపడేశాయ్‌గా

పాములంటే భయపడని వారెవరుంటారు చెప్పండి. కొంతమంది డైరెక్ట్‌గా చూడకపోయినా పాము పేరు చెబితేచాలు గజగజా వణికిపోతారు. కాగా ఈ మధ్య పాములకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Phani CH

|

Sep 23, 2022 | 9:12 AM

పాములంటే భయపడని వారెవరుంటారు చెప్పండి. కొంతమంది డైరెక్ట్‌గా చూడకపోయినా పాము పేరు చెబితేచాలు గజగజా వణికిపోతారు. కాగా ఈ మధ్య పాములకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది స్నేక్ క్యాచర్స్ అలవోకగా వాటిని బంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే పాములు పట్టే స్నేక్ క్యాచర్స్ కొందరు ఇటీవల అదే పాముకాటుకు బలైన విషాద ఘటనలు కూడా వెలుగుచూశాయి. తాజాగా ఒక వ్యక్తి ఒకే సారి 3 నాగుపాములను ఆడించేందుకు ట్రై చేసి.. ప్రమాదంలో పడ్డాడు. మాములుగా అయితే పడగ విప్పిన ఒక నాగుపామును మేనేజ్ చెయ్యడమే కష్టం. అది బుసలు కొడుతూ మీదకు దూసుకుని వస్తుంది. కానీ ఈ కర్ణాటకకు చెందిన ఈ కుర్రోడు.. మాజ్ సయ్యద్.. తన టాలెంట్ ఏంటో చూపేందుకు ఈ ప్రమాదకర స్టంట్ చేశాడు. ఒకేసారి 3 పడగవిప్పిన నాగుపాములతో ఆటలాడాడు. వాటి ముందు కూర్చుని.. వాటిని అటూ, ఇటూ ఆడించాడు. ఇతగాడి ఓవర్ యాక్షన్ భరించలేకపోయిన ఓ స్నేక్.. రివర్స్ పంచ్ ఇచ్చింది. ఒక్కసారిగా అతడి మీదకు దూకి మోకాలిపై కాటు వేసింది. అతడు దాన్ని వదిలించుకునేందుకు చాలా కష్టపడ్డాడు. IFS అధికారి సుశాంత్ నంద ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. పాములతో ఇలాంటి ఆటలు ఆడితే ప్రాణాలకే రిస్క్ అని తెలిపారు. ఇలాంటి ఆటలను పాములు తమకు ముప్పుగా భావించి అటాక్ చేస్తాయని వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

53 సార్లు పెళ్లాడిన వ్యక్తి.. మనశ్శాంతి కోసమే తప్ప మరొకటి కాదట..

డెలివరీ బాయ్ సాహసానికి వావ్ అనాల్సిందే.. ఏకంగా ట్రైన్‌నే చేజ్ !!

అమ్మమ్మా మజాకా.. తాతతో బైక్‌పై రయ్‌మంటూ దూసుకెళ్తోంది !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu