డెలివరీ బాయ్ సాహసానికి వావ్ అనాల్సిందే.. ఏకంగా ట్రైన్‌నే చేజ్ !!
ఆన్‌లైన్ యుగం వచ్చాక అంతా మారిపోయింది.. పెరిగిపోతున్న సాంకేతికతతో కావాల్సిన వస్తువులు నట్టింట్లోకి వచ్చేస్తున్నాయి. ఏ వస్తువు కావాలన్నా అడుగు బయటపెట్టకుండా ఒక్క క్లిక్ తో ఇంటి గడపకు చేరుతున్నాయి.
ఆన్‌లైన్ యుగం వచ్చాక అంతా మారిపోయింది.. పెరిగిపోతున్న సాంకేతికతతో కావాల్సిన వస్తువులు నట్టింట్లోకి వచ్చేస్తున్నాయి. ఏ వస్తువు కావాలన్నా అడుగు బయటపెట్టకుండా ఒక్క క్లిక్ తో ఇంటి గడపకు చేరుతున్నాయి. కష్టపడాల్సిన పని లేదు, చెమటలు కక్కాల్సిన అవసరం అంతకన్నా లేకుండా ఇంటికొచ్చి మరీ కావాలసిన వాటిని ఇచ్చే సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ రకాల ఆప్‌లు హోమ్ డెలివరీతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఇదంతా ఓ వైపు.. మరోవైపు ఆర్డర్ డెలివరీ చేసే బాయ్స్ పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించారా ?. ఎంత కష్టమొచ్చినా.. తమ విధి ధర్మాన్ని నెరవేరుస్తుంటారు.. ఎండైనా, వానైనా కస్టమర్లకు ఇబ్బంది రాకుండా.. సరైన సమయానికి ఆర్డర్ ను చేరువేస్తుంటారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో డెలివరీ బాయ్ వర్క్ పై తనకున్న డెడికేషన్‌తో నెట్టింట హీరో అయిపోయాడు. కదులుతున్న రైలును సైతం చేజ్ చేసి ఓ కస్టమర్‌కు వస్తువును అందించాడు. వివిధ రకాల వస్తువులను హోమ్ డెలివరీ అందించే ఏజెంట్ రన్నింగ్ ట్రైన్ వెంట పరుగెత్తి మరీ కస్టమర్‌కు ఆర్డర్ డెలివరీ చేశాడు. కస్టమర్ వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్టుగా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడికి ప్రమోషన్ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

