Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుపాకి చేతపట్టి పిల్లలను స్కూలుకు తీసుకెళ్తున్న తండ్రి !!  కారణం తెలిస్తే షాకే..

తుపాకి చేతపట్టి పిల్లలను స్కూలుకు తీసుకెళ్తున్న తండ్రి !! కారణం తెలిస్తే షాకే..

Phani CH

|

Updated on: Sep 23, 2022 | 9:14 AM

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కుక్కకాటు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా లక్నో, ముంబై, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, కాన్పూర్, కేరళ, తమిళనాడులో కుక్క కాటు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కుక్కకాటు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా లక్నో, ముంబై, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, కాన్పూర్, కేరళ, తమిళనాడులో కుక్క కాటు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీని కారణంగా వీధి కుక్కలు కంటపడితేనే వణికిపోతున్నారు ఆయా నగరాల్లోని ప్రజలు. ఈనేపథ్యంలో వీధి కుక్కల బారి నుంచి తన పిల్లలను రక్షించుకునేందుకు ఒక తండ్రి ఎస్కార్టుగా మారిపోయాడు. ఎయిర్‌ గన్ పట్టుకుని తన పిల్లలకు పహారా కాస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా ఆశ్చర్యపోతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన సమీర్‌ అనే వ్యక్తి ఎయిర్‌ గన్‌ చేతపట్టి గన్‌మ్యాన్‌లా తన పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్తున్నాడు. ఇంత బిల్డప్‌ ఎందుయ్యా అంటే.. ఇటీవల కేరళలో పలు ప్రాంతాల్లో వీధికుక్కల దాడులు ఎక్కువయ్యాయి. దాంతో తన పిల్లలను కుక్కలబారినుంచి కాపాడుకోడానికి ఇలా గన్‌మ్యాన్‌లా మారాడు. అంతేకాదు, తన పిల్లలపై వీధి కుక్కలు దాడిచేస్తే కాల్చివేస్తానని చెప్పాడు. కాగా తన పిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఎయిర్‌ గన్‌తో తిరుగుతున్నట్లు సమీర్‌ తెలిపాడు. తన కూతురు చదువుతున్న పాఠశాలలో ఓ విద్యార్థిని కుక్క కాటుకు గురైందని, దీంతో మదర్సాకు వెళ్లాలంటేనే విద్యార్థినులు భయపడుతున్నారని చెప్పాడు. కాగా ఇటీవల కోజికోడ్‌లో అరకినార్ గ్రామంలో వీధి కుక్కలు 12 ఏళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేశాయి. కుక్క దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ గ్రామంలో ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురిపై వీధి కుక్కలు దాడి చేశాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే.. పడగవిప్పిన 3 నాగులతో పరాచకాలు.. ఇచ్చిపడేశాయ్‌గా

53 సార్లు పెళ్లాడిన వ్యక్తి.. మనశ్శాంతి కోసమే తప్ప మరొకటి కాదట..

డెలివరీ బాయ్ సాహసానికి వావ్ అనాల్సిందే.. ఏకంగా ట్రైన్‌నే చేజ్ !!

అమ్మమ్మా మజాకా.. తాతతో బైక్‌పై రయ్‌మంటూ దూసుకెళ్తోంది !!

Published on: Sep 23, 2022 09:14 AM