టవల్‌, బనియన్‌ ధరించి మెట్రోలో ప్రయాణించిన యువకుడు.. నువ్వు నెక్ట్స్‌ లెవల్‌ బ్రో అంటున్న నెటిజన్లు

|

Dec 15, 2022 | 8:38 AM

మెట్రో రైల్లో కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఒక యువకుడు బాత్‌కోసం వాష్‌రూమ్‌కి వెళ్తున్నట్టుగా కేవలం టవల్‌ చుట్టుకొని, పైన ఒక బనియన్‌ వేసుకొని మెట్రోలోకి ప్రవేశించాడు.

మెట్రో రైల్లో కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఒక యువకుడు బాత్‌కోసం వాష్‌రూమ్‌కి వెళ్తున్నట్టుగా కేవలం టవల్‌ చుట్టుకొని, పైన ఒక బనియన్‌ వేసుకొని మెట్రోలోకి ప్రవేశించాడు. అతని డ్రెసింగ్ ను చూసిన తోటి ప్రయాణీకులు షాక్ తిన్నారు. అయినా అబ్బాయి రియాక్షన్స్‌ను పట్టించుకోలేదు. ఎవరేమనుకుంటే నాకేంటి.. నేను ఇంతే అన్నట్లుగా మెట్రోల్ లో ప్రయాణించాడు. ఈ వీడియో చూసిన వారు ఆ యువకుడి కాన్ఫిడెన్స్ చూసి.. మనిషి జీవితంలో ఇంత ఇంత కాన్షిడెన్స్‌ ఉంటే అద్భుతాలు చేస్తాడు అంటున్నారు. ఈ ఫన్నీ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో మోహిత్‌గౌహర్ అనే వినియోగదారుడు షేర్ చేశాడు. ‘ట్యాంక్‌లోని నీరు అయిపోయింది.. ఈ రోజు నేను ఆఫీసులోనే స్నానం చేస్తాను’ అంటూ వీడియోకి క్యాప్షన్ జత చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. లక్షమందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఇలాంటి పని చేయడానికి చాలా ధైర్యం కావాలి’ అని ఒకరు కామెంట్ చేయగా.. మీ మనసుకు ఏది అనిపిస్తే అది చేయండి.. ప్రపంచం ఏమి అనుకుంటుంది.. ఏమి చేస్తుంది అనే పనిలేదు అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు.. ‘నువ్వు నెక్ట్స్‌ లెవల్‌ బ్రో ’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మనిషి.. చెక్కు చెదరని రికార్డ్‌

వార్నీ.. కొబ్బరికాయ‌ను ఇలా కూడా కొడతారా !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

నీ వేగం ముందు ఏదైనా బలాదూరే సారూ.. 15 సెకండ్లలో 3 టికెట్లు

Published on: Dec 15, 2022 08:38 AM