ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మనిషి.. చెక్కు చెదరని రికార్డ్
ప్రపంచంలో అనేక రకాల ప్రపంచ రికార్డులు ఉన్నాయి. అయితే ఎవరొకరు రికార్డులు సృష్టించడం… వాటిని మరొకరు బీట్ చేయడం తరచుగా జరుగుతూనే ఉన్నాయి.
ప్రపంచంలో అనేక రకాల ప్రపంచ రికార్డులు ఉన్నాయి. అయితే ఎవరొకరు రికార్డులు సృష్టించడం… వాటిని మరొకరు బీట్ చేయడం తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని ప్రపంచ రికార్డ్స్ మాత్రం కొన్నేళ్లుగా పదిలంగా ఉన్నాయి.. ఇప్పటివరకూ వాటిని ఎవరూ బీట్ చేయలేకపోయారు. చరిత్రలో అత్యంత పొడవైన వ్యక్తి ఎవరో తెలుసా.. అతని రికార్డు ఎన్నోఏళ్లుగా బద్దలు కాలేదు? గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇప్పుడు తన అధికారిక ఖాతా ట్విట్టర్‌లో ఆ వ్యక్తి చిత్రాన్ని పంచుకుంది. ‘అత్యంత ఎత్తైన వ్యక్తి అద్భుతమైన చిత్రం’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ చిత్రంలో అతనితో పాటు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక చిన్న పిల్లవాడితో సహా మొత్తం 6 మంది వ్యక్తులున్నారు. ఈ వ్యక్తి పేరు రాబర్ట్ వాడ్లో, ఇతను 80 ఏళ్ల క్రితం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ రికార్డును ఇప్పటివరకూ ఎవరూ బ్రేక్ చేయలేదు. దాంతో వ్లాడో రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. రాబర్ట్ ఎత్తు 8 అడుగుల 11.1 అంగుళాలు. రాబర్ట్ తర్వాత ఇంత పొడుగ్గా ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు భూమిపై పుట్టలేదు. చరిత్రలో అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో అతని పేరు నమోదు కావడానికి కారణం ఇదే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వార్నీ.. కొబ్బరికాయను ఇలా కూడా కొడతారా !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా

