సొంత వైద్యంతో చావు అంచుల దాకా !! అసలు ఏం జరిగిందంటే ??

సొంత వైద్యంతో చావు అంచుల దాకా !! అసలు ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Aug 31, 2023 | 10:01 AM

జార్ఖండ్‌లోని లాతేహార్‌ జిల్లా బలుమత్‌ మండలంలో డయేరియా బారినపడ్డ అవధేశ్‌ కుమార్‌ సాహు అనే యువకుడు యూట్యూబ్‌ చూసి సొంత వైద్యం చేసుకున్నాడు. ఆ వైద్యం కాస్తా వికటించి.. ప్రాణాల మీదకు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. యూట్యూబ్‌ వీడియోలో సూచించిన విధంగా విరేచనాలు తగ్గేందుకు అవధేశ్‌ 10 కర్పూరం బిళ్లలు మింగాడు. అతడి ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించడం చూసి.. కుటుంబసభ్యులు ఏం జరిగిందని ఆరా తీశారు.

జార్ఖండ్‌లోని లాతేహార్‌ జిల్లా బలుమత్‌ మండలంలో డయేరియా బారినపడ్డ అవధేశ్‌ కుమార్‌ సాహు అనే యువకుడు యూట్యూబ్‌ చూసి సొంత వైద్యం చేసుకున్నాడు. ఆ వైద్యం కాస్తా వికటించి.. ప్రాణాల మీదకు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. యూట్యూబ్‌ వీడియోలో సూచించిన విధంగా విరేచనాలు తగ్గేందుకు అవధేశ్‌ 10 కర్పూరం బిళ్లలు మింగాడు. అతడి ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించడం చూసి.. కుటుంబసభ్యులు ఏం జరిగిందని ఆరా తీశారు. కర్పూరం బిళ్లలు మింగానని చెప్పడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రథమచికిత్స చేసిన స్థానిక వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని రిమ్స్‌కు రెఫర్‌ చేశారు. ఇటీవలి కాలంలో కొన్ని యూట్యూబ్‌ చానెళ్లలో సూచిస్తున్న చిట్కాలు అనుసరిస్తూ కొంతమంది ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారని వైద్యులు తెలిపారు. ఆ చిట్కాలు కొన్నిసార్లు మేలు చేసినా.. అన్ని వేళల్లో పనికిరావన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అండమాన్‌కు పారిపోయిన నిందితుడు.. 11 ఏళ్ల తర్వాత ఎలా పట్టుబడ్డాడంటే ??

ఆ ఇంట్లో పాములే పాములు.. ఒకదాని వెంట ఒకటి..

జడ్జి కొడుకు షూస్.. అని పాపం ఆ దొంగకేం తెలుసు !!

చిన్న బైకు..పెద్ద చక్రం !! ఇలాంటి ఐడియా మీకెప్పుడైనా వచ్చిందా ??

Ram Charan: మరో ప్రౌడ్ మూమెంట్.. పాప్ గోల్డెన్ అవార్డ్స్‌కు చెర్రీ