జడ్జి కొడుకు షూస్.. అని పాపం ఆ దొంగకేం తెలుసు !!
ఫ్యామిలీతో కలిసి దైవదర్శనానికి వెళ్లిన ఓ న్యాయమూర్తి కుటుంబానికి చెందిన వారి షూలే కొట్టేసారు దొంగలు. చాదస్తం కాకపోతే.. దొంగలకి న్యాయమూర్తి అయితే ఏంటి? న్యాయవాది అయితే ఏంటి..? వాళ్లకి కావలసింది ఎవరిదైనా సరే చంకనెట్టుకుపోవడం వారి వృత్తి ధర్మం. అదే చేశాడు ఇక్కడ ఓ దొంగ. గుడి బయట వదిలిన ఖరీదైన షూలను ఎత్తుకెళ్లిపోయారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రాజస్థాన్‌లోని ఆళ్వార్‌కు చెందిన పోక్సో కోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ అగర్వాల్
ఫ్యామిలీతో కలిసి దైవదర్శనానికి వెళ్లిన ఓ న్యాయమూర్తి కుటుంబానికి చెందిన వారి షూలే కొట్టేసారు దొంగలు. చాదస్తం కాకపోతే.. దొంగలకి న్యాయమూర్తి అయితే ఏంటి? న్యాయవాది అయితే ఏంటి..? వాళ్లకి కావలసింది ఎవరిదైనా సరే చంకనెట్టుకుపోవడం వారి వృత్తి ధర్మం. అదే చేశాడు ఇక్కడ ఓ దొంగ. గుడి బయట వదిలిన ఖరీదైన షూలను ఎత్తుకెళ్లిపోయారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రాజస్థాన్‌లోని ఆళ్వార్‌కు చెందిన పోక్సో కోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ అగర్వాల్ ఆగస్టు 20న తన కుటుంబంతో కలిసి జైపూర్‌లోని బ్రజ్‌నిధి దేవాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు వేసుకొచ్చిన రీబాక్ షూని బయట విడిచిపెట్టి లోపలికి వెళ్లి దైవదర్శనం చేసుకొని వచ్చారు. వచ్చి చూసేసరికి అతని షూలు కనిపించలేదు. అయ్యో నా పది వేల రూపాయల రూపాయల ఖరీదైన షూలూ పోయాయే అంటూ లబోదిబోమన్నాడు. దీంతో, న్యాయమూర్తి మణక్ చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ కేసును త్వరగా పరిష్కరించాలంటూ పోలీసులపై ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్న బైకు..పెద్ద చక్రం !! ఇలాంటి ఐడియా మీకెప్పుడైనా వచ్చిందా ??
Ram Charan: మరో ప్రౌడ్ మూమెంట్.. పాప్ గోల్డెన్ అవార్డ్స్‌కు చెర్రీ
TOP 9 ET News: ఒక్క రీల్‌తో.. చరిత్రకెక్కిన బన్నీ. | బిగ్ న్యూస్.. ఇక విజిల్సే !!
అయ్యో.. సూపర్ హిట్ సినిమాను చిరు పక్కకు పెట్టాడే !!
Pushpa 2: ఈ ఒక్క సీన్ చాలు.. థియేటర్ షేకవ్వడం పక్కా అంతే!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

