ఆ పథకం తెచ్చిన తంటా.. భర్తలను వదిలి ప్రియుళ్లతో భార్యలు జంప్‌ !!

కేంద్రప్రభుత్వం అందించిన నిధులు అందీఅందగానే ఐదుగురు వివాహితలు తమ భర్తలకు ఊహించని షాకిచ్చారు.

ఆ పథకం తెచ్చిన తంటా.. భర్తలను వదిలి ప్రియుళ్లతో భార్యలు జంప్‌ !!

|

Updated on: Feb 17, 2023 | 8:50 AM

కేంద్రప్రభుత్వం అందించిన నిధులు అందీఅందగానే ఐదుగురు వివాహితలు తమ భర్తలకు ఊహించని షాకిచ్చారు. విషయం తెలుసుకున్న బాధిత భర్తలు తమకు సాయం చేయకున్న పర్వాలేదు మా భార్యలను మాకు దూరం చేయొద్దంటూ అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద భూమి ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వాయిదాల్లో రెండున్నర లక్షలు అందజేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ పథకం కింద బారాబంకీ జిల్లాలో 40 మంది మహిళలు లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో మొదటి వాయిదా కింద 50 వేల రూపాయలు చొప్పున కొందరు మహిళల ఖాతాల్లో నగదు జమ చేశారు. అంతే తమ ఖాతాల్లో నగదు పడీపడగానే ఐదుగురు మహిళలు తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో కలిసి పారిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Silk Smitha: సిల్క్‌స్మిత సగం తిని వదిలేసిన యాపిల్‌.. వేలంలో ఎంత ధర పలికిందో తెల్సా ??

Samantha: ‘మన దగ్గర ఉండేదే ప్రేమ..’ సామ్ వాలెంటైన్స్ డే పోస్ట్ వైరల్ !!

Ram Charan: అదేంటో తెలియదు కానీ.. ఆ హీరోయిన్ అంటే నాకు పిచ్చి ప్రేమ !!

Jr NTR: త్రివిక్రమ్‌ డైరెక్షన్లో.. NTR పౌరాణిక సినిమా..

Shankar: RC15కు బ్రేక్ !! మళ్లీ మొదటికి శంకర్.. అసలు ఏం జరిగిందంటే ??

 

Follow us